రాష్ట్రంలో సెన్సేషన్ స్కీం: ప్రతి పేద కుటుంబానికి రూ.2.5 లక్షలు – ప్రభుత్వం నూతన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో పథకాన్ని ఉపయోగించుకోలేని వారికి నవంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్బన్-2.0 కింద రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో పీఎంఏవై పథకానికి మరో ఛాన్స్
  • నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • రూ.2.5 లక్షలు, రూ.1.8 లక్షలు అందజేస్తారు

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు శుభవార్త. రాస్ట్రంలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద ఇళ్లు కట్టుకోవడానికి అర్హులైన లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించారు. గతంలో సర్వేలో గుర్తించినా.. అవగాహన లేక చాలామంది కేంద్రం తీసుకొచ్చిన పీఎంఏవై పథకాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన కేంద్రంతో మాట్లాడారు.. మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించి పీఎంఏవై సర్వేకు గడువు ఇచ్చింది. నవంబర్ 5 లోపు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, పథకంలో చేర్చాలని అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పీఎంఏవై పథకం కింద లబ్ధిదారులకు పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సాయం ఎంత అందుతుందో తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జులై వరకు గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో పీఎంఏవై-అర్బన్ బీఎల్‌సీ 2.0, పీఎంఏవై గ్రామీణ్ 2.0 పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. 2024-29 మధ్యకాలానికి లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేపట్టారు. అయితే ఇటీవల పూర్తి చేసిన సర్వేలో చాలామంది లబ్ధిదారులను గుర్తించారు అధికారులు. అయితే ఇప్పటికీ కొందరు ఇళ్ల నిర్మాణం కోసం నమోదు చేసుకోలేదు. అందుకే ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆ వెంటనే కేంద్రానికి సీఎం లేఖ రాయడంతో నవంబర్ 5 వరకు గడువు పొడిగించారు. ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్-2.0 కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. ఈ పీఎంఏవై 2.0 పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.80 లక్షలు మాత్రమే అందిస్తారు. గతంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UDA) పరిధిలో ఉన్నవారికి కూడా యూనిట్ విలువ రూ.2.50 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈ రూ.2.50 లక్షల సహాయం కేవలం మున్సిపాలిటీల పరిధిలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రమంలో గతంలో UDA పరిధిలో నమోదు చేసుకున్న వారిని ఇప్పుడు ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు అధికారులు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 5 వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. వారు ఆ స్థలం డాక్యుమెంట్లను, ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాన్, బ్యాంక్ అకౌంట్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు గడువు లోగా గృహనిర్మాణ సంస్థ కార్యాలయాల్లో అందజేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *