
జనం న్యూస్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం కొత్త సిలబస్ ఏప్రిల్ నెలాఖరులోపు అందుబాటులోకి రానుంది.
హైలైట్:
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఫైనల్ పరీక్షలు
- 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో భారీ మార్పులు
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TS BIE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆమోదం మేరకు.. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు.


 
	 
						 
						