భారత అంతరిక్షంలో కొత్త చరిత్ర రాయబోతోంది ఇస్రో – బాహుబలి 2.0 రాకెట్ రెడీ!

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03 (CMS 03) అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03 (CMS 03) అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది.. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ రాకెట్ లాంచ్ ప్యాడ్ నందు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు.. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని వెహికిల్ ఆసెంబ్లింగ్ బిల్డింగ్ నందు రాకెట్ అనుసంధాన పనులను పూర్తిచేసి వాహక నౌకను లాంచ్ ప్యాడ్ కు విజయవంతంగా శాస్త్రవేత్తలు తరలించడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నానాటికి ముందడుగు వేస్తూ రాకెట్ ప్రయోగాల విజయ పరంపరలుతో ముందుకు దూసుకువెళుతుంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు నవంబర్ రెండవ తారీఖున మరో భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. అందులో భాగంగానే నవంబర్ 2 సాయంత్రం తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని రెండవ లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదిక కాబోతుంది. 4400 కేజీలు బరువు కలిగిన అతి భారీ బరువు కలిగినటువంటి జీ సాట్ సెవెన్ ఆర్ (GSAT..7R )అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36000 వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTO ORBIT (GEO SYNCHRONOUS TRANSFER ORBIT) భూ బదిలీ కక్ష లోకి ఈ భారీ ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ SPACE CENTER SHAR నుండి LVM3.. M5 రాకెట్ ప్రయోగం కోసం ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేశారు.. దీనిలో భాగంగా ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించడం జరిగింది. నవంబర్ 2న సాయంత్రం ఎల్విఎం3 ..M5 అనబడే రాకెట్ ద్వారా (GSAT..7R) జి సాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ఆర్బిట్ లోకి పంపేందుకు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ నందు యుద్ధ ప్రాతిపదికన రాకెట్ అనుసంధాన పనులు పూర్తి చేసి రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే వాతావరణం కనుక అనుకూలిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారం నవంబర్ 2న ఈ భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. ఈ తరహా రాకెట్ ప్రయోగం ఇదే తొలిసారి.. ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుండి ఇప్పటి వరకు ఇంత బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇస్రో మరో మైలురాయి అధిగమించనుంది.

మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేలా..

ఇదిలాఉంటే ఈ జీ సాట్ సెవెన్ (Gsat..7) అనబడే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు 2013వ సంవత్సరంలో ఫ్రెంచ్ గయానా నుండి కమర్షియల్ రాకెట్ ప్రయోగం చేసింది. ఆ రోజు నుండి భారత దేశంకు gsaat..7 శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఉన్న ఈ ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి జి సాట్ సెవెన్ ఆర్ GSAT..7R అనే ఈ ఉపగ్రహాన్ని అధునాతన టెక్నాలజీలతో రూపకల్పన చేసి నవంబర్ 2వ తారీఖున ఈ ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే ఈ జి సాట్ సెవెన్ ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని భూబాగంతో సహా మారుమూల ప్రాంతాలైనటువంటి అటవీ ప్రాంతంములు, విస్తృత సముద్ర ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ GSAT..7R ఉపగ్రహం ఉపయోగపడుతుంది.. 2013 లో ఇస్రో GASAT..7 ఉపగ్రహం కాల పరిమితి ముగియడంతో తిరిగి కొత్త ఉపగ్రహంను శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జి సాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహం ద్వారా భారతదేశానికి సరికొత్త విధానంలో ఇంటర్నెట్ సౌకర్యాలను మారుమూల ప్రాంతాల సైతం అందుకునే విధంగా ఈ జి సాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. ఈ Gaast..7R శాటిలైట్ భూమి మీద నుండి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష జీ టి ఓ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ GAST..7R ప్రయోగించిన రోజు నుండి మరో పది సంవత్సరముల కాలం పాటు భారతదేశానికి మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించే విధంగా ఈ జి సాట్ సెవెన్ ఆర్ ఉపయోగపడుతుంది. అయితే భారతదేశంలోని పలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పూర్తిగా సరిపడినంత ఇంటర్నెట్ సౌకర్యాలు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇస్రో సరికొత్త టెక్నాలజీతో ఈ జి సాట్ సెవెన్ ఆర్ ఉపగ్రహానికి రూపకల్పన చేసి ఈ ఉపగ్రహాన్ని విజయవంతం గా నింగిలోకి పంపి మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *