తాజా వార్త: తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కంగారు పడొద్దు – ఈ ట్రిక్‌తో ఈజీగా క్రెడిట్ కార్డు పొందండి!

బ్రేకింగ్ న్యూస్

జనం న్యూస్ : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం !

సాధారణంగా క్రెడిట్ కార్డులు జారీచేసేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే మంచి స్కోర్‌గా పరిగణించి క్రెడిట్ కార్డులు ఇస్తారు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు తెలుసా? 400 సిబిల్ స్కోర్ ఉన్నా సరే క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాం!  సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డులు పొందవచ్చు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. క్రెడిట్ హిస్టరీ లేనివారు, సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు కూడా ఈ రకమైన క్రెడిట్ కార్డులు తీసుకుంటారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై క్రెడిట్ కార్డులు : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ లేనివారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆధారంగా క్రెడిట్ కార్డులు పొందవచ్చు. ఇది ఒక నిర్దిష్ట రకమైన సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్, దీనిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారంగా ఈ కార్డులను జారీ చేస్తారు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన మొత్తంలో 80-90% వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. మీరు చేసిన డిపాజిట్‌పై వడ్డీ కూడా పొందవచ్చు. క్రెడిట్ హిస్టరీ లేకున్నా, సిబిల్ స్కోర్ 400 ఉన్నాసరే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా క్రెడిట్ కార్డులు పొందవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డుల వలన సిబిల్ స్కోర్ పెరుగుతుందా? ఫిక్స్‌డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డులను వాడుతూ సకాలంలో పేమెంట్స్ చేయడం వలన సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీ మెరుగవుతుంది. దీని వలన సాధారణ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ సులభంగా పొందవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి?

మీరు క్రెడిట్ కార్డు పొందాలనుకునే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి.

ఆన్‌లైన్ లేదా బ్రాంచ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాలి.

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులో 75 నుండి 90 శాతం వరకు లిమిట్‌తో క్రెడిట్ కార్డు పొందవచ్చు.

అన్‌సెక్యూర్డ్ కార్డులతో పోల్చితే, దీనికి డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డులు ఎవరు తీసుకోవచ్చు? 
క్రెడిట్ హిస్టరీ లేని స్టూడెంట్స్, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు పొందవచ్చు.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డులు…రెండూ ఒకటేనా?
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు క్యాష్ డిపాజిట్ ఆధారంగా జారీచేస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డులు మీరు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆధారంగా క్రెడిట్ లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *