తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం – జాయింట్ కలెక్టర్ పదవి రద్దు!

తెలంగాణ

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల పోస్టును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల పోస్టును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లకు విధులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అడవి భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు.. అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్దారణ చేపడతారు. వీరిని 1927 చట్టం ప్రకారం విధులు నిర్వహిస్తారు. వీళ్లు అన్ని రకాల భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, ముఖ్యంగా అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వీరి బాధ్యత. అటవీ ప్రాంతంలోకి యథేచ్ఛగా ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది. అడవుల పరిరక్షణ వీరి ముఖ్య విధి. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించినప్పటికీ, అదనపు కలెక్టర్లుగా వారి సాధారణ పరిపాలనా విధులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్‌కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలన పర్యవేక్షించేవారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు మరియు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తర్వాత వీరు ముఖ్యంగా ఉంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *