
జనం న్యూస్ :
Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. హీరో ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరైనా సానే పోస్టర్ పై దిల్ రాజు పేరు కనిపిస్తే చాలు హిట్టు అనేంతలా(Dil Raju) ఫేమ్ సంపాదించుకున్నాడు దిల్ రాజు. కానీ, ఏమైందో ఏమో తెలియదు ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు అంతగా ఆడటంలేదు. ఇక ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే తన తరువాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాము అని ఒకటిరెండు సార్లు ఆలోచిస్తున్నాడు. అలాగే ఇప్పటికే ఒకే అయినా ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా మార్పులు చేస్తున్నాడు. అందులో “జఠాయు” ఒకటి. భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ సినిమాను చేయాలనీ ప్లాన్ చేశాడు దిల్ రాజు. ఈ కథను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. భారీ బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమా చేయాలనుకున్నాడు దిల్ రాజు. అందుకు తగ్గట్టుగానే, ముందుగా ఈ కథను ప్రభాస్ కి, ఆ తరువాత విజయ్ దేవరకొండకి చెప్పాడు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఆ కథను కుర్ర హీరో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల తేజ సజ్జ హీరోగా వచ్చినహనుమాన్ , మిరాయ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అలాంటి కథతో రోషన్ ను హీరోగా పెట్టి జఠాయు సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. అతి త్వరగా సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. ఇలా రోషం విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఛాంపియన్ అనే పారియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


 
	 
						 
						