
జనం న్యూస్ : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో పోరాడబోతుంది. అక్టోబర్ 29న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20ఐ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Shreyas Iyer Health Update : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో పోరాడబోతుంది. అక్టోబర్ 29న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20ఐ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. అయ్యర్ ఆరోగ్యం గురించి సూర్య అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆస్ట్రేలియాపై చివరి వన్డే మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సిడ్నీలో చికిత్స జరుగుతోంది. తొలి టీ20ఐ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ గాయం గురించి వివరాలను అందించారు. ఆయన మాట్లాడుతూ.. అయ్యర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అతను మాకు ఫోన్‌లో సమాధానం ఇస్తున్నాడు, అంటే అతను పూర్తిగా బాగానే ఉన్నాడు. జరిగింది దురదృష్టకరం, కానీ డాక్టర్లు అతని ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. రాబోయే కొద్ది రోజులు అతనిని పర్యవేక్షిస్తారు. కానీ ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు” అని భరోసా ఇచ్చారు.
సూర్య ఇంకా మాట్లాడుతూ.. “అయ్యర్‌కు గాయమైన విధానం సాధారణంగా జరగదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. శ్రేయస్ కూడా అరుదైన ఆటగాడే కదా. అనుకోకుండా ఒక్కోసారి అలా జరుగుతుంది. దేవుడు తోడుగా ఉన్నాడు, అతను త్వరగా కోలుకుంటున్నాడు. మేము అతనిని ఇక్కడి నుండి మాతో పాటు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం” అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌కు సిడ్నీలో చికిత్స జరుగుతోంది. ఈ క్రమంలో అతని ఆరోగ్యం గురించి ఒక మంచి వార్త వెలువడింది. ఆసుపత్రిలో చేరిన తర్వాత అతను తొలిసారిగా ఘన ఆహారం తీసుకున్నారు. దీనితో పాటు ఎవరి సహాయం లేకుండా కొద్దిగా నడవగలుగుతున్నారు. ఫిజియోథెరపిస్ట్‌లు అతని ఆరోగ్యం మెరుగుపడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అతను ప్రస్తుతం జనరల్ వార్డ్‌లో ఉన్నాడు. త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.


 
	 
						 
						