
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడినవారిని పుంగనూర్ ప్రబుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 
	 
						 
						