
*ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ప్రకాశం పోలీసులు.
జనం న్యూస్ : అక్టోబర్ 28 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). ప్రకాశం జిల్లా ఎస్పీ “హర్షవర్ధన్ రాజు” ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు మరియు చెడు నడత గల వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు వారికి చట్టపరమైన అవగాహన కల్పించి, ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చెడు అలవాట్లను వదిలి, సమాజానికి ఉపయోగపడే మార్గంలో నడవాలని సూచించారు.పోలీసులు హెచ్చరిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల రక్షణ, సామాజిక శాంతి పరిరక్షణలో ఎవరు అడ్డుగా వస్తే ఉపేక్షించబోమని పేర్కొన్నారు.ప్రకాశం పోలీసులు ప్రజలతో సమన్వయంగా పనిచేస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తారని తెలిపారు.


 
	 
						 
						