సర్కార్ కీలక నిర్ణయం – మొంథా బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెరను ప్రభుత్వం అందించనుంది. తక్షణం పంపిణీని ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెరను ప్రభుత్వం అందించనుంది. తక్షణం పంపిణీని ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూరగాయలు, ఉల్లిపాయల సరఫరా నిరంతరంగా సాగేందుకు మార్కెటింగ్ కమిషనర్ పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని సూచించించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ట్వీట్ చేశారు.. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చింది. బియ్యం 25 కేజీలు (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహాయ చర్యలను, ఆహారం, నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారు. అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *