
జనం న్యూస్ : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలకు పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు.. ఎన్ని వ్యూహాలు రచిస్తారో, ఎన్ని రకాలుగా విచారణ చేసి.. అరెస్టు చేస్తారో మనకు తెలుసు.. కానీ విజయవాడలో మాత్రం ఒక ట్రాఫిక్ ASI కు సైబర్ నేరస్తులు టోకరా వేశారు. వీడియో కాల్ చేసి మరి నమ్మించి నిండా ముంచారు. దీంతో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసిన పాపానికి పాపం ASI బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయింది. దీనితో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సదరు ASI.. వివరాల ప్రకారం.. విజయవాడలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు అప్రూవ్ అయిందని 9666688738 అనే నంబర్ నుంచి ఫోన్ చేశారు. ఇక ఇది నిజమేనని నమ్మిన సదరు ASI తన మొబైల్ ఫోన్ వాట్సప్‌లో 9038715125 నంబర్ నుంచి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ లింక్ పేరుతో నుంచి వచ్చిన లింక్ క్లిక్ చేశారు.. అలా క్లిక్ చేసిన కాసేపటికే.. అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యింది. లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నట్లు చెబుతున్నారు. దీనితో మోసపోయానని గ్రహించిన ట్రాఫిక్ ఏఎస్ఐ.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. దొంగల చేతిలో పోలీసు అధికారి మోసపోవడం కలకలం రేపింది.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కొద్దని ఒకవైపు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తుంటే.. పోలీసులే సైబర్ క్రైమ్ బాధితులుగా మారడం స్థానికంగా సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

