ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామని విద్య కమిషన్ ప్రైవేట్ విద్యాసంస్థలను హెచ్చరించింది. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్‌. రూల్స్ ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు అని తెలియజేసింది. విద్యార్థులకు సమస్యలు ఉంటే 87126 27318, 08645 -274445 లకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 1109,,100,,1915అలాగే జిల్లా కన్జ్యూమర్ కోర్టు& జిల్లా కలెక్టర్లకు & ఎస్పీ కు రాష్ట్ర ప్రజలు, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *