
జనం న్యూస్: అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ తొలి హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి, యర్రగొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

