జనం న్యూస్ :- కాన్పూర్ నుంచి వైరల్ అయిన వీడియో ప్రకారం ఓ అమ్మాయి, అభిషేక్ అనే అబ్బాయి కొంతకాలంగా లవ్‌లో ఉన్నారు. ఏవో కారణాల వల్ల ఇద్దరు నీకు నాకు చెల్లు అంటూ బ్రేక్‌అప్ చెప్పుకున్నారట. ఈ మధ్య అభిషేక్ వేరే అమ్మాయిని చూసుకున్నాడు. ఇదే సమయంలో మాజీ ప్రియురాలు మళ్లీ అతడితో క్లోజ్‌గా మూవ్ అవుతూ వస్తోంది.
పాత అలవాటు ప్రకారం అభిషేక్‌ను బాబు అని ప్రేమగా పిలుస్తోంది. ఈ విషయం కొత్త ప్రియురాలి చెవిన పడింది. దీంతో ఆమె కోపం నషాలానికెక్కింది. యశోదా నగర్ బైపాస్ వద్ద రాత్రి వేళ అభిషేక్ మాజీ ప్రియురాలు, కొత్త ప్రియురాలు మధ్య గొడవ షురూ అయింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారి జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. అభిషేక్ మాజీ ప్రియురాలిని కొత్త ప్రియురాలు ఓ కుమ్ముడు కుమ్మింది. ‘నువ్వు అభిషేక్‌ను వదిలేశార అతడు నావాడయ్యాడు. నువ్వు అతడ్ని బాబు అని పిలుస్తావా? బాబు అని పిలుస్తావా?’ అంటూ జుట్టు పట్టి కుదేశి చెంపల మీద వాయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇద్దరమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలను రోడ్డు మీదకు తెచ్చేందుకు బుద్ది ఉండక్కర్లేదా అంటూ పోస్టులు పెడుతున్నారు.
కింద లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి


