అంజికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ

అంజికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ

జనం న్యూస్ నాగార్జునసాగర్*

నాగార్జున సాగర్ హిల్ కాలని కమలా నెహ్రూ హాస్పిటల్ నందు అనారోగ్యం తో చికిత్స పొందుతున్న పైలాన్ కు చెందిన అంజిని,నాగార్జున సాగర్ పైలాన్ కాలని గవర్నమెంట్ మెాడల్ హైస్కూల్ లో చదివిన 1992 - 93 ఎస్ ఎస్ సి విద్యార్థుల సమూహం,స్థానికులు పరామర్శించి యెాగక్షేమాలు తెలుసుకుని ,ఖర్చుల నిమిత్తము తమవంతు సాయంగా ఐదు వేల రూపాయిలను తమ బ్యాచ్ తరపున, 9వ వార్డు కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ చేతులమీదుగా అంజి కి అందజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాచ్ కాకపోయినను తోటివారి పట్ల మానవత్వం తో సహాయం చేయడాన్ని ఆయన అభినందించారు.ఇవే కాకుండా, మరెన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని,ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బి సుజాత, బి రేనుక, ఓర్సు వెంకటస్వామి, తిరుపతి కోటేశ్వరరావు, మసీదు రాము, ఎస్ డి రవూఫ్, అస్మత్ బీన్ పాష, కె వెంకట్, కౌన్సిలర్ ( ) ఆదాసు విక్రమ్,శేఖర్, ఆర్ రంగా, మల్లేశ్, శివ, నాని, వెంకి, తదితరులు పాల్గొన్నారు.