అభివృద్ధిప్రదాతని మరల ఆశీర్వదించండి

అభివృద్ధిప్రదాతని మరల ఆశీర్వదించండి

ఖమ్మం జిల్లా కల్లూరు మండల ప్రతినిధి సురేష్:- నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ను 15 సంవత్సరాలుగా ఆశీర్వదించారు, 15 సంవత్సరాల క్రితం సత్తుపల్లి నియోజకవర్గం ఎలా ఉండేది, ప్రజలకు మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడేవాళ్లు, పోలానికి వెళ్లాలంటే రోడ్లు ఉండేవి కావు, తాగుదామంటే మంచినీరు ఉండేది కాదు, ప్రభుత్వం నుండి వంద రూపాయలు రెండు వందల రూపాయల పెన్షన్ మాత్రమే మహిళలకు వృద్ధులకు సామాన్య ప్రజలకు దివ్యాంగులకు అందించేవారు ఉమ్మడి రాష్ట్ర పాలకులు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత స్వరాష్ట్రంలో మారుమూల గ్రామాలు పంచాయతీలు అయ్యాయి, పంచాయతీలు మున్సిపాలిటీలు అయ్యాయి, గ్రామ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయి, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, లింకు రోడ్లు, తారు రోడ్లు, వంటి సులభతరమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది, ప్రభుత్వం నుంచి ప్రతి పథకం 90 శాతం, లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కావడం శుభ పరిణామం, అలాగే స్వరాష్ట్రంలో ఉద్యోగులకు పిఆర్సి తోపాటు జీతభత్యాలు భారీగా పెంచారు, ఆర్థికంగా వెసులుబాటు కలగడానికి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్, బ్యాంకు రుణాలు, సెంట్రల్ బ్యాంక్ ద్వారా సొసైటీ రుణాలు,ఆసరా పెన్షన్లు భారీగా పెంచారు, కళ్యాణ లక్ష్మి రూపంలో, పేదింటి ఆడబిడ్డలకు ఆర్థికంగా భరోసానిచ్చారు, రైతుబంధు,రైతు బీమా,24 గంటల ఉచిత కరెంటు, ధరణి లాంటి పథకాలను రైతులకు ప్రభుత్వం మీద శాశ్వతమైన విశ్వాసాన్ని కలిగించెల చేశాయి, రైతు నాయకులుగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని సువర్ణ అక్షరాలతో తెలంగాణ ప్రజల మనసుల్లో లిఖించబడేలా చేశాయి, దళిత బంధు లాంటి సాహసోపేతమైన నిర్ణయాల వలన పుట్టిన పథకాల ద్వారా దళిత, గిరిజన, బహుజనులకు, బిఆర్ఎస్ ప్రభుత్వం వరంలా మారింది అని ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు,రాబోయే రోజుల్లో 2024 బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సామాన్య మధ్యతరగతి నిరుపేదల అభ్యున్నతి ధ్యేయంగా రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజల గుండెల్లో పథకాల రూపంలో నిలిచిపోయేలా చేయడంలో సఫలీకృతులయ్యారు,,సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృషితో సత్తుపల్లి నియోజకవర్గంనికి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో నెంబరు వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యది అని అంబేద్కర్ నగర్ బిఆర్ఎస్ యూత్ నాయకులు రాచప్రోలు రాజశేఖర్ వెల్లడించారు, ప్రతి గ్రామ పంచాయతీలు సీసీ రోడ్లతో గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్ భవనాలు, పంచాయతీ భవనాలు, బిటి రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, బ్రిడ్జిలు, సుందరమైన రహదారులు, మినీస్టేడియం, రైతు వేదికలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వైకుంఠధామాలు, ప్రజలకు అభివృద్ధి రూపంలో కళ్ళ ముందు కనపడుతున్నాయి, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సందర్భంగా మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సౌభాగ్య లక్ష్మి కానుకగా ప్రతి మహిళకు 3000 రూపాయలు, ఆరోగ్యలక్ష్మి కింద 15 లక్షల వరకు ప్రైవేట్ దవాఖానాల్లో ఉచితంగా వైద్యం కల్పించడం, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా పాలసీ ఏర్పాటు చేయడం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, సన్న బియ్యం రేషన్ షాపులో ఇవ్వడం, సత్తుపల్లి నియోజకవర్గం లో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చొరవతో అమలు చేయడం, దళితుల పక్షాన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు దళితుల పట్ల ఉన్న సానుకూల దృక్పథంనికి నిదర్శనమని తెలిపారు, సత్తుపల్లి నియోజకవర్గం లోని ప్రతి దళిత బిడ్డ ఈనెల జరగబోవు 30వ తారీఖున ఎలక్షన్ బూతులలో మీ అమూల్యమైన ఓటు ఐదో లైన్లో ఉండే కారు గుర్తుపై నొక్కాలని, దళిత, గిరిజన, బహుజన, నిరుపేద వర్గాల పక్షాన పోరాడిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వ పథకాలను కొనసాగించాలని, కల్లూరు అంబేద్కర్ నగర్ యుత్ లీడర్ రాచప్రోలు రాజశేఖర్ కోరారు,