ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వారోత్సవాలు

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వారోత్సవాలు

 *పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ వితరణ* 

 *మహిళ ఉపాధ్యాయులకు సన్మానం* 

 జనం న్యూస్ ప్రతినిధి ఉరుమడ్ల సంజీవ్ రాయికల్ పట్టణం జనవరి 10.

రాయికల్ పట్టణంలోని బాలికల పాఠశాలలో ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు చింతకుంట సాయికుమార్ ఆధ్వర్యంలో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ బాలుర, బాలికల మరియు ఉర్దూ మీడియం, జిల్లా పరిషత్ పాఠశాలల 

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

ఇట్టి సందర్భంగా ముఖ్య వక్తలు,పురపాలక సంఘం చైర్మన్ మోర హాన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ మ్యాకల అనురాధ లు మాట్లాడుతు దేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులురాలు అయిన మహాత్మా సావిత్రిబాయి పూలే అనేక కష్టాలు నష్టాలకు ఓర్చి ,ఆకాలంలో ఉన్న మూడ ఆచరాలను వ్యతిరేకించి ఆమె భర్త మహాత్మా జ్యోతి భా పూలే సహకారంతో మహిళలల విద్యా కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్య చెప్పిన ఆమె సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొవాలని అన్నారు, ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని,ఆదిశగా ముందుకు సాగాలని సూచించారు ,అనంతరం మహిళ ఉపాధ్యాయులకు సన్మానం చేసి,విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ,కౌన్సిలర్ తురగ శ్రీధర్,ఓబీసీ సమాఖ్య రాష్ట్ర ఉపాఅధ్యక్షులు, కడకుంట్ల జగదీశ్వర్ ,లయన్ క్లబ్ డి సి,మ్యాకల రమేష్,లయన్స్ క్లబ్ మండల కార్యదర్శి గంట్యాల

ప్రవీణ్,ఇమ్మడి విజయ్ కుమార్, యచమనేని కిరణ్ రావు,బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు సామల సతీష్ ,నాయకులు ఇర్పాన్ అలీ,రాకేష్ నాయక్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు శ్రీపతి రాఘవులు, పొన్నం రమేష్,సిబ్బంది పాల్గొన్నారు.