ఆత్మ గౌరవ పాదయాత్ర అవనిశ్రీ...

ఆత్మ గౌరవ పాదయాత్ర అవనిశ్రీ...

జనం న్యూస్ 26 మార్చి 2024 : 
ఇది ఆత్మగౌరవ పాదయాత్ర
ఇది అట్టడగు వర్గాల హక్కులకై సాగే యాత్ర...
దశాబ్దాల కుటుంబ పాలనను గద్దెదించడానికి
శతాబ్దాలకాలం పాటు 
రాజ్యానికి దూరమై 
కుర్చీకోసం కొట్టుమిట్టాడుతున్న
ప్రజలను గద్దెనెక్కించడానికి సాగే యాత్ర.

మా జనాలను మీ కాళ్లకింద చెప్పులతీరు చూస్తిరి
మీ గాడిపాడులో గొడ్లపక్కల్నే బంధిస్తిరి
మీ కొంపలకాడ 
మా ప్రజలను కింద కూసోబెట్టి 
అనరాని మాటలంటుంటే
ఆ అవమానాలకు 
గుండె భగ్గున మండిపోయినందుకే
ఈ పాదయాత్ర.

ఓకే కుటుంబం కింద నలిగిపోయినయి మా జాతులు
ఒకే కులం కింద వంగిపోయినయి మా వర్గాలు
ఈ ఆధిపత్యాలను పటాపంచలు చేసి 
మా కింది వర్గాలంత రుబాబుగా 
తలెత్తుకునేటందుకే ఈ పాదయాత్ర.

ఓట్లకు బీడీకట్టలను పంచితిరి
ఓటుకు బీరు బిర్యాని పెడ్తిరి
ఓటుకు మురిగిన చికెన్ ఇస్తిరి
మా జనాలను బిచ్చగాళ్ళుగా మార్చిన ఈ వ్యవస్థను
వేర్లతో సహా పెకలించేందుకే ఈ పాదయాత్ర.

ఓటుకు నోటును తీసుకున్న మనం
ప్రశ్నించే హక్కును కోల్పోతమని చెప్పే యాత్ర
తొంబై ఏడు శాతమున్న మనం
ఏడు శాతమున్న వర్గాలు ఎట్లా పాలిస్తాయి
అనీ చైతన్యంచేసే యాత్ర ఇది.

మా జనాలను అడ్డపేర్లతో పిలవకుండా
మా ప్రజలను కులం పేర్లతో తిట్టకుండా
ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకు
మనిషిగా గుర్తింపునిచ్చే కనీస మర్యాదలకోసమే పాదయాత్ర.

దోపిడీలను అడిగినందుకు 
కుత్తుకలు కోసిన ఆనవాలున్నాయి
దుర్మార్గాలను ఎండగట్టినందుకు దునుమాడిన 
దస్త్రాల గుర్తులున్నాయి
వీటిని పాతరేసేటందుకే ఈ పాదయాత్ర.
పేదలపై అక్రమంగా కేసులు పెట్టి
జైళ్లకు పంపిన మా జనాలను జాగృతం చేసే యాత్ర
బడుగు బలహీన వర్గాల ప్రజలను కూడగట్టే యాత్ర.ఇసుక,మట్టి,సీడ్ మాఫియాలకు 
వ్యతిరేకంగా కొట్లాడుతూ
దౌర్జన్యాలు చేసే దండును తరిమికొట్టి
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించి
రేపటి గద్వాల కోటపై బహుజన జెండా ఎగరేయడమే
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా