ఇంటర్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

ఇంటర్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

జనంన్యూస్/ఏప్రిల్ 29/భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా/ భువనగిరి నియోజకవర్గం :- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన ఫలితాలలో భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన ఘనత ఒక్క శ్రీ చైతన్యదే అని , ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినందుకు విద్యార్థులను అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన  విద్యార్థులకు వరుసగా ఎంపీసీ విభాగంలో K. నవ్య 974/1000, బైపీసీ విభాగంలో M. అర్చనా జ్యోతి 906/1000 సీఇసీ విభాగంలో M. తేజస్వి 834/1000 జ్ఞాపికలను అందజేసి స్వీట్స్ అందజేశారు. తదనంతరం శ్రీ చైతన్య కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధించడం ఒక్క శ్రీ చైతన్యకే సాధ్యం అని, ఇదే ఉత్సాహంతో మా కళాశాల విద్యార్థులు ఎంసెట్ నీట్ నందు ఉత్తమ ర్యాంకులు సాధించాలి అని అన్నారు. తదనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వరుసగా ఎంపీసీ విభాగంలో అయేషా 454/470, బైపీసీ విభాగంలో రుమాన 419/440, సీఇసీ విభాగంలో D. అంజలి 462/500 మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు స్వీట్స్ అందజేశారు. తదనంతరం కళాశాల ప్రిన్సిపల్ అంబోజు మల్లేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడుకున్న విద్య ఎప్పటికీ సత్ఫలితాలు  ఇస్తుంది అని మా శ్రీ చైతన్య విద్యార్థులు చాటి చెప్పడం అందుకు నిదర్శనం అని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు యంపల కొండల్ రెడ్డి, కొరటి కంటి శ్రీధర్ గౌడ్ తో పాటు అధ్యాపకులు  పోతన్ రాము, స్టీఫెన్, మురళి, సదానందం, సంతోష్, శ్రావణి, శ్రీలత లతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.