ఇంటి పన్నుల వసూళ్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

ఇంటి పన్నుల వసూళ్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

జనం న్యూస్:-21 / శ్రీరాంపూర్
నస్పూర్ పరిధిలోని 15, 20వ వార్డులలో మున్సిపల్  కమిషనర్ చిట్యాల సతీష్ ఇంటి పన్నుల వసూళ్లును స్వయంగా పరిశీలించారు. ఇంటి పన్నుల వసూళ్లలో భాగంగా నస్పూర్ మున్సిపల్  చైర్మన్ సురిమిళ్ల వేణు వారి ఇంటి పన్నును చెల్లించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నస్పూర్ పట్టణ ప్రజలు (ఓటీఎస్) 53 జివో ఆర్టి నెం. 101, తేదీ: 27.02.2024 ప్రకారముగా ఆర్థిక సంత్సరం 2022-23 వరకు అస్తి పన్ను బకాయిలపై 90% శాతం వడ్డీ మాఫీని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆర్థిక సంవత్సరం 2023-24 లో గల దానికి కేవలం వడ్డీ 10 శాతంతో బకాయిలు చెల్లంచగలరని పేర్కొన్నారు. ఇట్టి స్కీమ్ చివరి తేది 31.03.2024 వరకు మాత్రమే అమలులో ఉంటుందని చెప్పారు. కావున నస్పూర్ పట్టణ ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోని, ఇంటి పన్నులను విధిగా సకాలములో చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమములో రెవెన్యూ అధికారి కె సతీష్ బిల్ కలెక్టర్స్ పాల్గొన్నారు.