కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి గిరిజన సంఘాల మద్దతు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి గిరిజన సంఘాల మద్దతు

జనం న్యూస్ 2024 మే 8 మెదక్ (జిల్లా బ్యూరో)

ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ మరియు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజు ను అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్ని విధాలుగా దోపిడీ చేసినటువంటి నియంకృత పాలనను ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడించి ఫామ్ హౌస్ కే పరిమితం చేశారో అదే విధంగా దేశంలో 10 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసిన బిజెపి ని ఓడించాలన్నారు. 
మెదక్ జిల్లా ప్రజలు చైతన్యవంతులు ఒకప్పుడు దేశ ప్రధాని ఇందిరా గాంధీ నీ ఇక్కడ నుంచి గెలిపించి దేశానికి ప్రధానిని చేసి దేశాన్ని మెదక్ నుండి పరిపాలించారని గుర్తు చేశారు.
అలాంటి చరిత్ర గల మెదక్ పట్టణం నుంచి ఒక బహుజన బీసీ బిడ్డ అనగారిన వర్గాల నుంచి వచ్చిన నీలం మదు ను రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలన్నారు.
బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ని కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మెదక్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 
గత 10 సంవత్సరాలుగా దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మన దేశ రాష్ట్రపతి ని కనీసం పార్లమెంట్ భవనం, అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బిఆర్ఎస్ పార్టీని  మెదక్ పట్టణం లో బొంద పెట్టాలన్నారు.
హరీష్ రావు,కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెబుతున్నారన్నారు. ఏ మొహం పెట్టుకొని మెదక్ ప్రజల ను ఓటు వేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు. 
మెదక్ జిల్లాకు కలెక్టర్ గా పని చేసిన వ్యక్తి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మెదక్ జిల్లాకు ఏం చేశాడని ప్రశ్నించారు.
కలెక్టర్ గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ పేద ప్రజలను నమ్మించి మోసం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించి భూములన్నిటిని దోచుకొని, కెసిఆర్ ప్రభుత్వానికి అప్ప చెప్పి ప్రజల నోట్లో మట్టి కొట్టాడన్నారు.
రాజపుష్పం పేరుతో పేద ప్రజల వేలకోట్ల డబ్బులు దోచుకుని హైదరాబాద్ లో భూములను కొన్నాడు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ వాటాలు ఇచ్చి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మెదక్ ప్రజలను ఓట్లు అడుగుతున్నావు అన్నారు.
ముందుగా మీ యొక్క వేలకోట్ల డబ్బును ఆస్తిని పేద ప్రజలకు పంచి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. 
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు చిన్నతనం నుంచి కష్టాలు పడ్డ వ్యక్తి తల్లిదండ్రులు లేని కిందిస్థాయి నుంచి సర్పంచిగా,జడ్పిటిసిగా పనిచేసిన బడుగు బలహీనవర్గాల పేద బిడ్డగా మీ ముందుకు వస్తున్నారు. 
మీ యొక్క ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా లంబాడి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.