ఎలక్ట్రికల్ ఈ ఈ రవికుమార్ కు ఉత్తమ సేవా పురస్కారం

ఎలక్ట్రికల్  ఈ ఈ రవికుమార్ కు ఉత్తమ సేవా  పురస్కారం

జనం న్యూస్ జనవరి 26 కాట్రేనికున  అమలాపురం జనవరి 26 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  అమలాపురం విద్యుత్ కార్యాలయం నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న  మోకా రవికుమార్ కు ఉత్తమ సేవా  పురస్కారం అవార్డు లభించింది 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా  శుక్రవారం  అమలాపురం జిఎంసి బాలయోగి  క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు  శుక్లా, రవాణా శాఖ మంత్రి  పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు  చింతా అనురాధ  చేతుల మీదుగా  ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల   ఎలక్ట్రికల్ డి ఈ లు  ఏఈలు  విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్లు  లైన్మెన్లు  ఇతర సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు