ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావుకు ఉత్తమ సేవా పురస్కారం

ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావుకు ఉత్తమ సేవా పురస్కారం

జనం న్యూస్ కాట్రేనికోన జనవరి 26. ......  కాట్రేనికోన ఎలక్ట్రికల్ కార్యాలయము నందు ఏ ఈ ఈ గా పని చేస్తున్న బి నాగేశ్వరరావుకు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉత్తమ సేవా పరిష్కారం లభించింది వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం మండలంలో విద్యుత్ శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను  ఎక్కువగా చేయించడంతో ఈ అవార్డు కు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏపీ ఈ పి డి సి ఎల్   సి ఎం డి  (ఐ ఏ ఎస్) పృద్వి తేజ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ అవార్డుకు ఎంపిక  అయినది నాగేశ్వరరావు  కావడం విశేషం.  ఆయనకు ఉత్తమ సేవ పురస్కారం అవార్డు లభించడం పట్ల కాట్రేనికోన విద్యుత్ కార్యాలయ మండల సిబ్బంది మండల రాజకీయ నాయకులు మండల వినియోగదారులు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.