కమ్యూనికేషన్స్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్*

కమ్యూనికేషన్స్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్*

జనం న్యూస్,జనవరి 13 

విజయనగరంఐదు

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో గల కమ్యూనికేషన్ విభాగంకు నిర్మించిన అదనపు

గదులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక జనవరి 12న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక కు కమ్యునికేషన్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి, పుష్ప గుచ్ఛంలను అందజేయగా, ఎస్పీ గారు నూతనంగా నిర్మించిన గదుల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మాట్లాడుతూ - కమ్యూనికేషన్ విభాగంలో పని చేసే మహిళా సిబ్బంది వేచి ఉండేందుకు మరియు కమ్యూనికేషన్ విభాగం పరికరాలను ఉంచేందుకు స్టోర్ రూం అవసరమని తెలపడంతో, తక్కువ వ్యయంతో అన్ని సౌకర్యాలను

సమకూర్చి, రెండు గదులను శ్రమదానంతో నిర్మించి, వాటిని కమ్యూనికేషన్ విభాగంకు అందుబాటులోకి తీసుకొని

వచ్చామన్నారు. వీటిని కమ్యూనికేషన్ సిబ్బంది సద్వినియోగం చేసుకొని, చక్కగా వినియోగించుకోవాలని కోరారు. కమ్యునికేషన్ సిబ్బందికి ఇంకను అవసరమైన అదనపు సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశించారు.

అనంతరం, గదుల నిర్మాణంకు శ్రమదానం చేసిన పోలీసు సిబ్బంది, హెూంగార్డులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించి, వారికి క్రొత్త బట్టలను ప్రధానం చేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ట్రెయినీ ఐపిఎస్ మండ జావలి అల్ఫాన్స్, డిఎస్పీలు

డి.విశ్వనాధ్, ఆర్.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరావు, యూనివర్స్, సిఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి,

జె.మురళి, శ్రీకాంత్ యాదవ్, ఆర్ఐలు శ్రీనివాసరావు, గోపాలనాయుడు, రమణమూర్తి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,

కమ్యూనికేషన్ ఎఎస్ఐ సోమేశ్వరరావు, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.