కాంగ్రెస్ పార్టీని నమ్మి మళ్ళి మనం మోసపోవొద్దు..... మాజీ మంత్రి హరీష్ రావు....

కాంగ్రెస్ పార్టీని నమ్మి మళ్ళి మనం మోసపోవొద్దు..... మాజీ మంత్రి హరీష్ రావు....

సీఎం రేవంత్ రెడ్డి ఒక గుంపు మేస్త్రి.....
కాంగ్రెస్ ఉద్దరిస్తదనుకుంటే ఉద్దెర మాటలు చెప్తోందని మండిపాటు.....

సునీతమ్మ, నేను అసెంబ్లీలో కొట్లాడాలంటే ఎంపీ ఎన్నికలలో వెంకట్రాంరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి.....


పేదల భూములు, అక్రమ బియ్యం దందా చేసినోళ్లే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని మండిపాటు.....

జనం న్యూస్ ఏప్రిల్ 29.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

అసెంబ్లీ ఎన్నికలలో గెలిపిస్తే రాష్ట్రాన్ని ఉద్దరిస్తుందని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే ఉద్దరించుడు పోయి ఉద్దెర మాటలు చెపుతున్నారని, కాంగ్రెస్ పార్టీని నమ్మి మళ్ళి మనం మోసపోవొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.ఎంపీ ఎన్నికల సందర్బంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి సారథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ అధ్యక్షతన, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సహకారంతో శివ్వంపేటలో ఆదివారం సాయంత్రం భారీ రోడ్ షో నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ నాలుగున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆయన ఏద్దేవా చేశారు. ఓట్ల కోసం సీఎం దేవుండ్లపై ఓట్లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక గుంపు మేస్త్రి
ఆరు గ్యారంటీల పేరుతో నమ్మించి గద్దెనెక్కిన నయవంచకుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక గుంపు మేస్త్రి అని, ఎంపీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఒడిస్తారని గ్రహించి, ఆరు గ్యారంటీల అమలు చేతకాక కెసిఆర్ పై, నాపై తిట్ల పురాణం అందుకున్నారని ఆయన మండిపడ్డారు.
 కరెంట్ సక్కగియ్యక మోటార్లు కాలుతున్నాయ్
సీఎంగా కెసిఆర్ ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తే రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ సక్కగియ్యక రైతుల బోరు మోటార్లు కాలిపోతున్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు.అన్నదాతలు పండించిన వడ్లను కొనమంటే 6 కిలోల తరుగు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు.క్వింటాలు వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు 5 వందలు బోనస్ అందిస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు.
 పేదల భూములు గుంజుకున్నోళ్లు కాంగ్రెస్ లోకి పోయిండ్రు.
పేదల భూములు గుంజుకున్నోళ్లు, అక్రమ మట్టి అమ్ముకున్నోళ్లు, బియ్యం దందా చేసినోళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని కానీ కడిగిన ముత్యాల్లాంటి, నీకార్సయిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వాళ్ళు పోయింది కూడ పార్టీకి శనిపోయినట్లయిందని, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు పార్టీ నుండి వెళ్లిన వారు కాళ్ళు మొక్కిన అప్పుడు పార్టీలోకి ఎట్టి పరిస్థితిలో తీసుకోమని, దొంగల భరతం పడతామని ఆయన ఉద్ఘటించారు.  శివ్వంపేట చైతన్య గడ్డని, పార్లమెంట్ ఎన్నికలలో వెంకట్రాంరెడ్డిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
పటాకులు మోతతో మార్మోగిన శివ్వంపేట మండల కేంద్రం
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రోడ్ షో సందర్బంగా జడ్పీటీసీ మహేష్ గుప్త ఆధ్వర్యంలోని పీఎంజీ యువసేన ఏర్పాటు చేసిన పటాకుల మోతతో మండల కేంద్రమైన శివ్వంపేట హోరేత్తిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బ్యాంకు కూడలి వరకు అడుగడుగునా పటాకులు కాలుస్తూ, డప్పు చప్పుల్లు, బ్యాండు వాయిద్యాల మధ్య కార్యకర్తలు సందడి చేశారు. కళాకారుల ఆటపాటలకు మహిళా కార్యకర్తలు సంతోషంగా డాన్స్ చేస్తూ కారు గుర్తుకు జై కొట్టారు. 
 రోడ్ షోలో పాల్గొన్న ప్రజాప్రతినిధుల 
బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో లో ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్,వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి,మండల కో ఆప్షన్ మెంబర్ లాయక్, పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, ప్రధానకార్యదర్శి రాజశేఖర్ గౌడ్, యువత అధ్యక్షులు పవన్ గుప్త, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామకమిటీ అధ్యక్షులు, లక్ష్మీ నరసయ్య నాయకులు పాల్గొన్నారు.