మీ ఆశీర్వాదం కోసం వచ్చాను....ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

మీ ఆశీర్వాదం కోసం వచ్చాను....ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

హుజురాబాద్ రూపు రేఖలు మార్చి చూపిస్తా పాడి కౌశిక్ రెడ్డి
కెసిఆర్ ను ఒప్పించి 1000కోట్ల నిధులు తెస్తా
70 కోట్లతో కలువల ప్రాజెక్ట్ కటిస్తా
మెజారిటీ ఇస్తే గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలను దత్తత తీసుకుంటా
చెప్పినవి చేయకుంటే ఓట్ల కోసం మళ్ళీ మీ ముందుకు రాను
జనం న్యూస్ కరీంనగర్ నవంబర్ 8:---( కరీంనగర్ బ్యూరో రాచర్ల వేణు )  తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వెళుతున్నానని, నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా రెండు చేతులు జోడించి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి హుజురాబాద్ అభివృద్ధి చేసి హుజురాబాద్ రూపు రేఖలు మార్చి చూపిస్తానని  అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు హుజురాబాద్ అభివృద్ధి సరిగా జరగలేదని, 2021 అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దేశంలో ఎక్కని లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు 19 వేల కోట్లతో రుణమాఫీ కూడా చేశారనిబి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడని, కొత్త మేనిఫెస్టోలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని అన్నారు. ఇందులో ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరిట అర్హులైన మహిళలందరికీ నెలకు 3000 చూపున ఇవ్వనున్నామని, అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 400 కి అందిస్తామన్నారు. అన్నపూర్ణ పేరుతో సన్న బియ్యం అందించనున్నామని, ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. అలాగే కెసిఆర్ ధీమా ఇంటింటికి బీమా అనే పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారి కుటుంబంలో ఎవరైనా పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు అందజేస్తామన్నారు. ప్రస్తుతం 2000 ఉన్న పెన్షన్ 5 వేలకు చేస్తామని 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ దఫాలవారీగా 6000 చేస్తామని అన్నారు. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధిలో హుజురాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తానని అన్నారు. 70 కోట్ల వ్యయంతో కల్వల ప్రాజెక్టు కట్టిస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చి సిద్దిపేట తరహాలో హుజురాబాద్ అభివృద్ధి చేసుకుంటామనని అన్నారు. గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలో భారీ మెజారిటీ ఇస్తే రెండు గ్రామాలను దత్తత తీసుకొని చక్కటి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గృహలక్ష్మి బిసి బంధు పెట్టుకున్న వారందరికీ ఎన్నికల అనంతరం చెక్కుల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఏడుసార్లు ఓటు వేసి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించిన అభివృద్ధి చేయలేదని, తనకు ఒక్క అవకాశం కల్పిస్తే హుజురాబాద్ ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒకవేళ నేను చెప్పిన చేయకపోతే ఓటు కోసం మరోసారి మీ ముందుకు రానని అన్నారు మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలా ఉండాలని అన్నారు. ఇదే అభిమానాన్ని ఎన్నికల వరకు కొనసాగించి తన గెలుపుకు కృషి చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా పనిచేసి మీ  రుణం తీర్చుకుంటానని అన్నారు. మూడోసారి కూడా తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడున్న సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఒప్పించి 1000కోట్ల నిధులు తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంపత్, వీరన్న లతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.15 సంవత్సరాలుగా గడపగడప తొక్కుతున్నాం ఒక్క అవకాశం ...
కౌశిక్ రెడ్డి సతీమణి షాలినిగత 15 సంవత్సరాల నుంచి మీలోనే ఉంటున్నామని, సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతి గడపగడప తొక్కుతున్నామని కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని అన్నారు. 20 ఏళ్లుగా ఒకే వ్యక్తికి అవకాశం ఇచ్చారని ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ అభివృద్ధిపై తపన ఉందని ఓటు వేసి గెలిపిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాబోతున్నాడని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినప్పుడు ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. నేను మీ ఊరి ఆడబిడ్డగా అడుగుతున్న తమకు ఒక్క అవకాశం కల్పించాలంటూ ప్రజలను అర్థించారు. దీనిపై స్పందించిన గ్రామస్తులంతా తప్పక అవకాశం కల్పిస్తామని చప్పట్లతో తమ మద్దతు తెలిపారు.