కాంగ్రెస్ వి మోసపూరిత వాగ్దానాలు

కాంగ్రెస్ వి మోసపూరిత వాగ్దానాలు

జనం న్యూస్ 07 మే 2024 
హామీల అమలు చేతగాక బిఆర్ఎస్ పార్టీపై బురద జల్లుతారు.బిఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనది..
కారు గుర్తుకు ఓటేద్దాం..
ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీనీ అభ్యర్థిని గెలిపిద్దాం
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 20,21,31వ వార్డ్  లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారు బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటికి  ప్రచారం నిర్వహించడం జరుగుతుంది.
ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్స్ నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని స్పష్టం చేశారు.

 

గద్వాల పట్టణంలో ను కెసిఆర్ గారు నాయకత్వంలో ప్రతి వార్డ్ సిసి రోడ్డు డ్రైనేజీ , వ్యవస్థ నిర్మాణం , పట్టణ ప్రకృతి  ప్రకృతి వనం,  గద్వాలలో చరిత్రను తిరగరాసే విధంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. నూతన బస్టాండ్ ఇంటిగ్రేట్ మార్కెట్, ఇండోర్ ఆడిటోరియం, ఫ్లై ఓవర్, సెంట్రల్ లైటింగ్ ఇలా ఎన్నో  అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానంలో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు 24 గంటలు నాణ్యత మైన కరెంటును అందజేసేవారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టినాక ప్రజలకు సమయానికి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో తెలియని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని గుర్తు చేశారు.
  
 వార్డులలో నీటి సమస్యతో ఇబ్బంది పడేవారు  కేసీఆర్ గారి పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి   స్వచ్ఛమైన తాగునీటి ను అందించిన ఘనత మాది.  కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 140 రోజులకు ప్రజలకు సరైన నీళ్లు తాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏనాడు కూడా అధికారులతో ఏ ఒక్క సమీక్ష సమావేశంలో కూడా నిర్వహించలేదు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.  కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల గురించి కనీసం కూడా ఆలోచన చేయడం లేదు వారు ఢిల్లీ నాయకులతో శభాష్గిరి కోసం ఇతర పార్టీల నాయకులను వారి పార్టీలోకి చేర్చుకొని దానిపైన దృష్టి పెట్టడం జరిగింది ఏనాడు కూడా ప్రజల సంక్షేమం గురించి కనీసం   ఆలోచన చేయలేదు అని అన్నారు.


అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తే  6 గ్యారెంటీలను  అమలు చేస్తామని ఎన్నో మాయమాటలు చెప్పారు.  . వృద్ధులకు 4000 పింఛన్ రాలేదు, గ్యాస్ సిలిండర్ రాలేదు , ప్రతి పేదవారి ఇంటికి 200 కరెంటు యూనిట్లు ఉచితం అన్నారు ఇంతవరకు అమలు కాలేదు. రైతులకు రైతుబంధు కేసీఆర్ గారు 10000 ఇస్తే మేము 15000 ఇస్తామని ఇంతవరకు ఏ రైతు ఖాతాలో కూడా రైతుబంధు జమ కాలేదు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేక పోయారు ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేక విఫలం అయ్యారని తెలిపారు.   


బిజెపి పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది.  తెలంగాణ ప్రయోజనాల కోసం గానీ  తెలంగాణ రైతాంగం కోసం గాని  ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కనీస తెలంగాణకు నిధులను కూడా కేటాయించలేదు.  కేవలం మతం హిందుత్వం అనే నినాదంతోనా ప్రజలలోకి వెళ్లి ప్రజలకు మధ్య  కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మధ్య  ప్రశాంతంగా ఉన్నవాడిల్లో చిచ్చులు పెట్టడం అలజడి సృష్టిస్తున్నారు. అదేవిధంగా పేద, మధ్యతరగతి, సామాన్యులకు పైన నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ వంటి పై ధరలు పెంచి ప్రజలకు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తున్నారు. ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించాలని సూచించారు.

 మన పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల పాఠశాల ద్వారా దాదాపు 10లక్ష మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారికి అత్యున్నత స్థాయి కల్పించారు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు పార్లమెంటులో ఉంటే గద్వాల ప్రాంతంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవకాశం కలుగుతుంది అని ఆకాంక్షించారు.

  బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థి  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మే 13వ తేదీ నాడు కారు గుర్తుపైన ఓటు వేసి వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.


???? ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, మురళి , రామకృష్ణ శెట్టి,గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహబూబ్ , భగీరథ వంశీ  రామాంజనేయులు, నర్సింహులు, సీతారాములు, దౌలన్న , ప్రదీప్ నర్సింహులు, శ్రీ కుమార్ , గాంధీ, సూర్య ప్రకాష్, బాలాజీ, వెంకట్ స్వామి,వీరేష్, విజయ్, రాజు మౌలాలి,  నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.