కార్మికులకైతే 8 లక్షలు అధికారుల కైతే 25 లక్షలు ఇదేమి చోద్యమంటున్న కార్మికులు

కార్మికులకైతే 8 లక్షలు అధికారుల కైతే 25 లక్షలు ఇదేమి చోద్యమంటున్న కార్మికులు

జనం న్యూస్ కోల్బెల్ట్ ఏరియా ప్రతినిధి మార్చి 27: సింగరేణి బొగ్గు పరిశ్రమలో 30 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన కార్మికులకు వైద్య ఖర్చుల నిమిత్తం కార్మికుల నుండి 40 వేల రూపాయలు రికవరీ చేసుకొని ఆ కుటుంబానికి మెడికల్ కార్డు యాజమాన్యం సమకూరుస్తుందని భార్యాభర్తలిద్దరికీ కలిపి ఎనిమిది లక్షల వరకు వైద్యం పొందే అవకాశం ఈ కార్డు ద్వారా కార్మిక కుటుంబాలకు అందుతుంది దీంట్లో కూడా ఎన్నో రకాల ఆంక్షలు ఒక్కో సందర్భంలో కార్మిక కుటుంబాలు హైదరాబాదులోని కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్య నిమిత్తం వెళ్లినప్పుడు కంపెనీ నుండి రావలసిన బిల్లులు రాలేదని వైద్యం అందించడానికి నిరాకరిస్తూ సింగరేణి కార్మిక కుటుంబాలను కించపరుస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయినా కూడా అధికారుల్లో అలసత్వం కొనసాగుతూనే ఉంటుంది అంతేకాకుండా  ఇదే సింగరేణి కంపెనీలో పనిచేసి దిగిపోయిన అధికారులకు మాత్రం 25 లక్షలకు వైద్య సౌకర్యం కల్పిస్తుంది దీనిలో కూడా వ్యత్యాసం ఎందుకని ఆసుపత్రికి వెళ్లినప్పుడు మందులు కొన్నప్పుడు వైద్యం పొందినప్పుడు అందరికీ సమానమైన ఖర్చులే అవుతాయి అలాంటప్పుడు కార్మికులకు కంచాల్లో అధికారులకు ఆకుల్లో వడ్డించే తీరుగా తేడాలు ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు కార్మికుల కోసం తెగ పోరాటం చేస్తున్నామని చెప్తున్న కార్మిక సంఘాలు కార్మికులకు జరుగుతున్న ఇంతటి అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరని కార్మికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది నిత్యం భరించలేని వేడిని సైతం లెక్కచేయకుండా గాలి లేకపోయినా సరైన నీటి సౌకర్యం అందుబాటులో ఉండకపోయినా కార్మికులు శ్రమిస్తూ ఉత్పత్తి సాధిస్తుంటే సంస్థకు లాభాలు వస్తున్నాయి అంటే అది కార్మికుల శ్రమ ఫలితమే కానీ అధికారుల చెమట ఫలితం కాదని అయినప్పటికీ సింగరేణి బొగ్గు పరిశ్రమలో ఈ విధమైన అన్యాయానికి కార్మికులను గురి చేయడం కార్మిక సంఘాలకు కనపడడం లేదా హక్కుల కోసమే ప్రాణ త్యాగాలు చేశామని చెప్పుకునే సంఘాల నాయకులకు కార్మికుల పట్ల ప్రేమెందుకు లేదని బాహాటంగానే కార్మికులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఉద్యోగం చేస్తున్న సందర్భంలోనూ అన్ని రకాల టాక్స్ ల మీద కార్మికుల వేతనాల నుండి ఇంకా టాక్స్ రికవరీ చేస్తున్న యాజమాన్యం అధికారులకు మాత్రం అలవెన్స్ ల మీద మినహాయింపులు కల్పించడంలో అర్థం ఏంటో చెప్పాలని కార్మికులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో దేశ అవసరాలకు అవసరమైన బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో బొగ్గు గని కార్మికుల పాత్ర వెలకట్టలేనిది మానసికంగా కార్మికులను వేధించడానికే కొంతమంది అధికారులను లక్షల రూపాయలు వెచ్చించి నియమిస్తున్న యాజమాన్యం ఉద్యోగం చేస్తున్న క్రమంలో రిటైర్డ్ అనంతరం ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టుతుంటే గెలిచిన సంఘాలు కార్మికుల పక్షమా అధికారుల పక్షమా తేల్చి చెప్పాలని కార్మికులు నిలదీస్తున్నారు కర్ర పెత్తనం చేసే వాళ్లకు సర్వీసులో ఉన్నప్పుడు లక్షల్లో జీతాలు ఇస్తారు కార్మికులకు వేళల్లో చెల్లిస్తారు సంక్షేమం విషయంలోనూ ఒక అధికారి ఒక ఏరియా నుండి బదిలీ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ల రూపంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న సింగరేణి యాజమాన్యం అతనికి వెళ్లేటప్పటికీ అతనికి కేటాయించే ఇంటిని ముస్తాబు చేసి సమకూరుస్తుంది కార్మికులకు మాత్రం అలాంటిదేమీ కల్పించరు ప్రతి విషయంలోనూ శ్రమిస్తున్న కార్మికులకు అణువు అణువునా అన్యాయమే ఎదురవుతున్నప్పటికీ ఈ వ్యత్యాసాన్ని ఎత్తిచూపడంలో కార్మిక సంఘాల నాయకులు విఫలమవటం వల్లనే కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని కార్మికులను అన్ని రకాలుగా హక్కులు పొందే విధంగా మా పోరాటమని ఊదరగొట్టే సంఘాల నాయకులు సమాధానం చెప్పాలని కార్మికులు జవాబు కోసం ఎదురు చూస్తున్నారు మరి నాయకుల ప్రతిస్పందన ఏంటో వేచి చూద్దాం.