కోటి పారాయణ హనుమాన్ చాలీసా మహాశక్తి హోమం

కోటి పారాయణ హనుమాన్ చాలీసా మహాశక్తి హోమం

జనం న్యూస్ జనవరి 22 కాట్రేనుకున

ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ మరియు రాష్ట్రీయ హిందూ సేన సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పర్యవేక్షణలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహా శక్తి హోమం ఐ పోలవరం మండలం ముమ్మిడివరం మండలం కాట్రేనికోన మండలాలలోని కోటి పారాయణ హనుమాన్ చాలీసా పటించిన భక్తులందరితో ఉదయం నుంచి ఆలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమం నిర్వహించి హనుమాన్ శక్తి హోమం పూర్ణహాతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శృంగ వృక్షం దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగ నంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఇటువంటి శక్తివంతమైన పారాయణ హోమ క్రతువులు చేయడం వలన ప్రకృతిలో శక్తి చేకూరి మానవుడు రక్షింపబడతాడన్నారు అలాగే హిందువులలో భక్తి భావం పెరిగి భగవంతుడు వైపు మనసును మళ్లించడానికి మార్గం సుగమం అవుతుందన్నారు 500 సంవత్సరాల నుండి ఎదురుచూసిన అయోధ్య రామ మందిరం అత్యంత అద్భుతంగా మన అందరి సహాయ సహకారంతో నిర్మాణము జరిగి ప్రారంభమవుతున్న సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మరింత శక్తి పెరుగుతుంది అన్నారు రాముడు చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ రామ తత్వాన్ని అందరము తెలుసుకొని ఆచరించినచో మన జీవితాలు ఆనందమయంతో వెలుగొందుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహ కన్వీనర్ గుబ్బల శ్రీనివాస్ బిజెపి జిల్లా కార్యదర్శి గ్రంధి నానాజీ రవీంద్ర స్కూల్ కరస్పాండెంట్ పొత్తూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజు ఆధ్యాత్మిక సేవకులు బి.లక్ష్మీనారాయణ సలాది శ్రీరామచంద్రమూర్తి నంద్యాల నరసింహస్వామి ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు.