కోరుట్ల శిశుమందిర్ స్కూల్ లో హిందీ దివస్ వేడుకలు

కోరుట్ల శిశుమందిర్ స్కూల్ లో హిందీ దివస్ వేడుకలు

జనం న్యూస్ కోరుట్ల సెప్టెంబర్ 15ఈరోజు కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో హిందీ దివస్ దినాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ఆటపాటలతో హిందీ దివస్ దినాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హిందీ పండిట్ శ్రీ వోటరికారి చిన్న రాజన్న  విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి హిందీ భాష పైన ఉన్న పట్టును, మరియు హిందీ భాష పుట్టుక గురుంచి విద్యార్థులకు  వివరించడం జరిగింది. మన జాతీయ భాష(నేషనల్ ల్యాంగ్వేజ్)గా పేరుగాంచిన "హిందీ" భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను "హిందీ దివస్" (హిందీ దినోత్సవం)గా జరుపుకుంటారు. ఇందుకు గల కారణం 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి ఈ తేదీను హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితి అని విద్యార్థులకు వివరించారు.. హిందీ భాష పరిజ్ఞానాన్ని విద్యార్థులకు విషాధికరించి చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్  ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రిన్సిపల్ వెంకటేష్ హిందీ బాషా ఆవశ్యకతను వివరించడం జరిగింది. మరియు పాఠశాల హిందీ ఆచార్యులు మహేష్ చౌహన్ హిందీ మాతాజీలు సంధ్య మరియు కావ్యగారు విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హిందీ భాషా పరిజ్ఞానానికి సంబంధించిన  హిందీలోని కవితలు మరియు హిందీ గేయాలు భారత్ యొక్క గొప్పతనాన్ని హిందీలో నేర్పించి మంచి ప్రదర్శన ఇచ్చేలా విద్యార్థులకు నేర్పించడం జరిగింది. ఇటి కార్యక్రమంలో పాఠశాల ఆచార్య బృందం ప్రబంధకారిణి సభ్యులు మరియు సమితి సభ్యులు అందరూ పాలు పంచుకోవడం జరిగింది.