క్షేత్ర స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, బైండోవరు చేయాలి.

క్షేత్ర స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, బైండోవరు చేయాలి.

జనం న్యూస్,ఫిబ్రవరి 29
విజయనగరం
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షాసమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్., ఫిబ్రవరి 28న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ - ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేసి, కుణ్ణంగా దర్యాప్తు చేయాలని, ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేవిధంగా సాక్ష్యాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన, వారిపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై అధికారులకు న్యాయ నిపుణులు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేయాలని, వాహన తనిఖీలు, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించాలని, అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకు అతీతంగా గుర్తించి, వారిని బైండోవరు చేయాలని, స్థానిక తాశీల్దారు కార్యాలయాల్లో వారిపై బాండులను ఎగ్జిక్యూట్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. స్టేషను స్థాయిలో హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల్లో నేర ప్రవృత్తి కలిగిన చరుకైన వ్యక్తులను గుర్తించి, ప్రతీ శనివారం వారిని స్టేషనుకు పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు చేసే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, పెద్ద మొత్తంలో మద్యంను స్వాధీనం చేసుకొనే విధంగా నిఘా ఏర్పాటు చేయాలని, దాడులు నిర్వహించాలని సెబ్ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో గ్రామస్ధులతో సమావేశాలు నిర్వహించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రచారం కొరకు అనుమతులు కోరుతూ వివిధ పార్టీల నాయకులు చేసే దరఖాస్తు వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక రిజిష్టరును ఏర్పాటుచేసి, వివిధ పార్టీల దరఖాస్తు వివరాలను రిజిస్టరులో పొందుపర్చాలన్నారు. అనంతరం, వివిధ డిఎస్పీలు, సిఐల వద్ద దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తుల పురోభివృద్ధిని సంబంధిత దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి దర్యాప్తు అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ 

మోటారు సైకిళ్ళ చోరీలు, దొంగతనాల కేసుల చేధనలోను, అక్రమ మద్యం, గంజాయి, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషను, ట్రాఫిక్ రెగ్యులేషన్, డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయుటలోను, ఎన్ఫోర్స్మెంట్ కేసులునమోదు చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేసారు. ప్రశంసా పత్రాలు పొందిన వారిలో విజయనగరం 2వ పట్టణ సిఐ కే.కే. రామారావు, ఎస్ఐలు ఐ.దుర్గా ప్రసాద్, జి. రాజేష్, ఎస్.హరిబాబు నాయుడు, జె.తారకేశ్వరరావు, ఎఎస్ఐ సిహెచ్. అరి, హెడ్ కానిస్టేబుళ్ళు ఎన్. హరి కృష్ణ, కానిస్టేబుళ్ళు ఎం.వాసు, కే.వి.గణేష్, కే. సత్యం, వి.రఘు, టి.సతీష్,డి.దేముడు, జి.రమేష్, సిహెచ్. అప్పల నాయుడు, ఎం.మహేశ్వరరావు, జే. చిరంజీవి, వై.సతీష్ కుమార్, మహిళా కానిస్టేబులు జి.గౌరమ్మ, మహిళా హెూంగార్డు ఎన్. ఇందుమతి వున్నారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్బీ అస్మా ఫర్హీన్, ట్రెయినీ ఐపిఎస్ కుమారి మండ జావలి అల్ఫాన్స్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్సీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ట్రాఫిక్ డిఎస్సీ డి.విశ్వనాధ్, ట్రెయినీ డిఎస్పీ ఎస్. మహేంద్ర, న్యాయ సలహాదారులు వై.వరశురాం, పబ్లిక్ ప్రాసిక్యూటరు కేశవరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎఈఎస్ డి.వి.జి. రాజు, డిసిఆర్ఎ సిఐ జె.మురళి, ఎస్బి సిఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ నర్సింహమూర్తి, 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు, దిశ సిఐ బి.నాగేశ్వరరావు, కొత్తవలన సిఐ వి.చంద్రశేఖర్, రాజాం సీఐ డి. మోహనరావు, సిసిఎస్ ఎ.సత్యన్నారాయణ, బొబ్బిలి రూరల్ సిఐ ఎస్. తిరుమల రావు, బొబ్బిలి సిఐ ఎం.నాగేశ్వరరావు, కంట్రోల్ రూం సిఐ రాజశేఖర్, ఎస్.కోట సర్కిల్ సిఐ హెచ్.ఉపేంద్ర, రాజాం రూరల్ సిఐ ఎస్. శ్రీనివాస్, డిటిసి సిఐ ఎ.వి.లీలారావు, టాస్క్ఫోర్స్ సిఐ అశోక్ కుమార్, సైబర్ సెల్ సిఐ టి.వి.విజయ కుమార్, చీపురుపల్లి సిఐ సిహెచ్.షణ్ముఖ రావు, విజయనగరం రూరల్ సిఐ ఎం.శ్రీనివాసరావు, సెల్ సిఐ బి.లలిత, ఆర్బలు టి. శ్రీనివాసరావు, గోపాల నాయుడు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు,ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.