ఘనంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘ భవన ప్రారంభోత్సవము

ఘనంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘ భవన ప్రారంభోత్సవము

ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక , మెట్టుగూడ మహిళా మోర్చా కార్యదర్శి రాచూరి లక్ష్మి , మహిళా మోర్చా అధ్యక్షురాలు సుంకరి భానుమతి,

జనం న్యూస్ , ఫిబ్రవరి 27, సికింద్రాబాద్ నామాలగుండు లో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహా సభ కోశాధికారి లింగిచెట్టి హనుమంత రావు ఆధ్వర్యములో ఆదివారం నాడు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘము భవన ప్రారంభోత్సవ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహా సభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరావు , ముఖ్య అతిధులుగా , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ పాల్గొని భవనం ప్రారంభోత్సవము చేసారు , ఈ సందర్భముగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మున్నూరుకాపు కుల సోదరులు అందరూ కలసికట్టుగా ఉన్నపుడే వారి మన ఆశయాలు సాధించుకుంటాము , కుల అభివృద్ధికి అందరు సమైక్యముగా ఉండాలి అని సూచించారు మున్ముందు మున్నూరుకాపు కుల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాను అని తెలిపారు , అసెంబ్లీ నియోజకవర్గములో కుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న లింగిచెట్టి హనుమంతరావు , ఆకుల కృష్ణ రావు మరియు ఇతర సంఘ సభ్యులను అభినందిచారు, రాష్ట్ర మున్నూరుకాపు మహా సభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరావు మాట్లాడుతూ మున్నూరుకాపులు అందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిస్కారము అవుతాయి కుల అభివృద్ధి, సంక్షేమము కొరకు తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహా సభ తరుపున అనునిత్యము కృషి చేస్తున్నాము సికింద్రాబాద్ సంఘముకు మా వంతు సహకారము అందిస్తాము అని తెలిపారు, అనంతరము సికింద్రాబాద్ సంఘము అధ్యక్షులు లింగిచెట్టి హనుమత రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణరావు , కోశాధికారి చెరియాల శ్రీనివాస్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం కుల బంధువులందరి సహకారముతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కుల సంఘ అభివృద్ధియే మా ప్రధాన ద్యేయము, కుల సోదరులు ఎవరు ఆపదలో ఉన్న సికింద్రాబాద్ కుల సంఘము తరుపున రాజకీయాలకు అతీతంగా ఆదుకుంటాము అని తెలిపారు. తదనంతరం ముఖ్య అతిధులకు , కుల నాయకులకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమములో అనన్య ఎన్విరో ఇంజనీర్స్ అధినేత పెద్దిశెట్టి విజయ్ కుమార్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, కోట శంకర్ ఆనంద్ రావు , జెల్లీ సిద్దయ్య, పన్నాల విష్ణువర్ధన్ , సుంకరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహా సభ ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్ , ఉప అధ్యక్షులు మణికొండ రమేష్, కొండూరి వినోద్ , గర్ష మోహన్ , మాధ ప్రమోద్, కిట శంకర ఆనంద్ రావు , లాలాపేట్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు చిల్కా శ్రీనివాస్ , కార్యదర్శి మీసాల శ్రీనివాస్ బీజేపీ మెట్టుగూడ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుంకరి భానుమతి, మెట్టుగూడ మహిళా మోర్చా కార్యదర్శి రాచూరి లక్ష్మి , తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ బాధ్యులు కొప్పుల బుచ్చిరాములు కరీంనగర్ జర్నలిస్ట్ యూనియన్ కో కన్వీనర్ పడాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు