జాతీయ యువజన దినోత్సవాన్ని" నిర్వహించిన "అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

  

జనం న్యూస్,జనవరి 13 

విజయనగరంఐదు

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక కామాక్షి నగర్,అయ్యన్నపేట వద్దనున్న నడక మైదానంలో (కొత్త వాకింగ్ ట్రాక్) క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు)నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా సమాజంలో ఎంతో నిస్వార్థంగా సేవచేస్తున్న యువతీ యువకులైన మదర్ థెరీసా ప్రజాసేవా సంఘం& బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ ప్రసాద్ పట్నాయక్ కు, స్పందన దివ్యాంగుల సేవా సమాజం అధ్యక్షుడు కందివలస సురేష్ కు, స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యదర్శి పాండ్రంకి సంతోష్ కుమార్ కు,అశ్విని యూత్ క్లబ్ వ్యవస్థాపకురాలు కుమారి పెంకి అశ్విని కు,పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు,సంఘ సేవకులు మాతా బుజ్జి కు ముఖ్యఅతిథిలుగా హాజరైన క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాష్టారు, ఆరికతోట తిరుపతిరావు,శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ లచే సత్కరించటం జరిగింది. 

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతను చైతన్య వంతుల్ని చేసిన సుప్రసిద్ధ గొప్ప ఆధ్యాత్మిక వేత్త,యోగి, విదేశాల్లో సైతం హిందూధర్మం విశిష్టతను, భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు శ్రీ స్వామి వివేకానందని అటువంటి మహనీయున్ని యువతంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సీనియర్ నడక సభ్యులు కోట్ల సత్యనారాయణ,పి.అప్పలరాజు,ప్రకాశరావు,పాత్రుడు,నలమహారాజు, పైడిరాజు శ్రీరామ్,పి.శ్రీను,పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.