ముమ్మిడివరం నియోజకవర్గం కోర్ కమిటీ సమావేశం

ముమ్మిడివరం నియోజకవర్గం కోర్ కమిటీ సమావేశం

జనం న్యూస్ జనవరి 26 కాట్రేనికోన ఈరోజు 26-1-2024 ముమ్మిడివరం నియోజకవర్గం కోర్ కమిటీ సమావేశం ముమ్మిడివరం అర్బన్ అధ్యక్షులు కొయ్యల దుర్గారావు అధ్యక్షతన నిర్వహించినారు  ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ గోల కోటి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో మండల సమావేశాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లాలి అదే విధముగా ప్రతి మండలంలోని పూర్తిస్థాయిలో శక్తి కేంద్ర ప్రముఖులను నియమించాలి మండలానికి కనీసం రెండు పార్టీ స్థూపాలను కట్టించాలి మరియు వాల్ రైటింగ్ విధిగా వ్రాయించాలని తెలియజేసినారు ఈ సమావేశమునకు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మరియు రాష్ట్ర జిల్లా పదాధికారులు 5 మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు