తుంబకుప్పం గ్రామంలో సత్యమ్మ తల్లి ఆశీస్సులతో గొప్ప మైలేరు పండగ

తుంబకుప్పం గ్రామంలో సత్యమ్మ తల్లి ఆశీస్సులతో గొప్ప మైలేరు పండగ

బంగారుపాల్యం, జనంన్యూస్ మార్చి 3: తుంబకుప్పం గ్రామంలో వెలసి యున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆశీస్సులతో గొప్ప మైలేరు పండుగ అంగరంగ వైభవంగా, పరిసర గ్రామాల వాళ్లు పాల్గొంటున్నట్లు మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని   తెలియజేశారు. ఈ యొక్క మైలేరు పండుగలో పాల్గొనే వాళ్లు టోకెన్ ₹3,500 చెల్లించి తీసుకోవలసినదిగా తెలియజేశారు. మైలేరు పండుగలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ,రెండవ బహుమతిగా గ్లామర్ బైకు ,మూడో బహుమతిగా బజాజ్ బైకు, నాలుగో బహుమతిగా 40 వేలు ,ఇలా 40 బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. టోకెన్ తీసుకోవాలి అని అనుకుంటున వారు  ఈ క్రింది నెంబర్లను ఫోన్పే ద్వారా చెల్లించి టోకెన్లు తీసుకోగలరు 850034551, 833985332,7569482808.