తెలంగాణలో కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్ ఓటింగ్

తెలంగాణలో కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్ ఓటింగ్

జనం న్యూస్ 21 నవంబర్ 2023 :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు ఈ నెల 30న జరగనుండటంతో పోలింగ్‌కు ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలిసారి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు.ఇందులో భాగంగా ఇవాళ ఇంటింటి ఓటింగ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్స్ ఓటు వేశారు. ఇక, ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందుగా ఫామ్ డి-12 సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీని ద్వారా ఎన్నికల అధికారి వారికి ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారు. అయితే, తెలంగాణలో 28,057 మందికి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేందుకు ఈసీ అధికారులు అనుమతించగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.  అయితే, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్ సిబ్బంది సేకరించి తీసుకుని వెళ్తున్నారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్ సిబ్బంది ఇళ్లకు చేరుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 

కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. బీఆర్కే భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ వికాస్ రాజ్, అడిషనల్ సీఈఓలు లోకేష్, సర్ఫరాజ్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్ ఓటింగ్ పై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో నవంబర్ 30న జరుగనున్న పోలింగ్ పై ప్రధానంగా చర్చించారు.

*జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ డిస్ట్రిక్ట్*