ప్రేమ విఫలమైన ఒకరు పరీక్షలో నేటి సమాజంలో

ప్రేమ విఫలమైన ఒకరు పరీక్షలో నేటి సమాజంలో

జనం న్యూస్ 04 మే 2024. :- సమాజంలో నేటి యువకులు ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో ఉత్తీర్ణులు కాలేనని వెధతో మరొకరు, జీవితములో ఫెయిల్యూర్ అయ్యానని ఇంకొకరు, అనుకున్నది సాధించలేకపోయానని ఒకరు, పంటలు పండగ అప్పుల పాలైనను అంటూ మరొకరు,  ఇలా.. ఇలా..ఎందరో.. క్షణిక ఆవేశంలో బ్రతుకు మీద ఆశను వదిలి తీవ్రమైన ఒత్తిడితో  ఆత్మహత్య చేసుకుంటున్నారు. చావడానికి లేని భయము బ్రతకడానికి ఎందుకు ధైర్యము లేదు...? మానవజన్మ ఎంతో  ఉకృష్టమైనది, ఎంతో శ్రేష్టమైనది. మానవుడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అంటూ గోశించాయి వేదాలు, ఉపనిషత్తులు. నీవు మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. అలాంటిది నువ్వు అద్భుతాలు సృష్టించలేవా..? నీవు ఏదైనా చేయగలవు.. నీలో అద్భుతమైన గొప్ప శక్తి ఉంది నీవే గుర్తిస్తే లేవు ఎంత విచారమో కదా! నీ జీవితంలో జరిగే సంఘటనలను చూసి భయపడి వందేళ్ళ ని జీవితాన్నే వదిలేస్తావా..? నీవు తలుచుకుంటే  ఎన్నో అద్భుతాలు సృష్టించగలవు. అలాంటిది చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తే ఎలా...? ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకమైన సృజనాత్మక శక్తి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. మీరు చేయవలసింది నీలో ఉన్న గొప్ప సృజనాత్మక శక్తిని బయటకు తీయడమే. నీలో ఒక గొప్ప కళాకృతి ఉంటే, ఇంకొకరిలో మరేదో కళాకృతి ఉంటుంది. నువ్వు నీవే  ఎవరితో పోల్చుకోకు. నీకంటే తోపు ఎవ్వరు లేరు..నీవు చేయాల్సింది నీలో ఉన్న టాలెంటును  గుర్తించడమే, దాన్ని గుర్తించి వెలికి తీయడమే..అది సాధన తోనే సాధ్యమవుతుంది. నేను ఇది సాధించగలనా..? అనే సంశయమే నిన్ను ఏమి పనికి రాని వాడిగానే సమాజంలో  నిలుపుతుంది. నేను చేయగలుగుతాను అనే మనోధైర్యం నీకుంటే, నువ్వు ఏదైనా చేయగలవు. అన్నిప్రచండమైన శక్తులు నీలో ఉన్న నీవు చతికిలబడితే ఎలా...?  ఏది తేరగా  దొరకదు. తేరగా దొరికింది ఎప్పుడు నిలబడదు.. ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నించు కానీ, ఊపిరే తీసుకోకు.  పిరికివాడిగా చనిపోకు. ఇది కాకుంటే..మరొకటి.. ప్రయత్నించు, శోధించు సాధించు.. తప్పకుండా ఏదో ఒక రోజు  గొప్ప వ్యక్తిగా కీర్తించబడతావు. అదే నీవు మనిషిగా పుట్టినందుకు నీవు చేయవలసిన అంతిమ  కర్తవ్యం.