బస్ కండక్టర్ పై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా

బస్ కండక్టర్ పై దాడి చేసిన కేసులో ఇద్దరు  నిందితులకు రెండు సంవత్సరాల  జైలు శిక్ష,  జరిమానా

జనం న్యూస్ 11 ఏప్రిల్ 2024.:- విధులలో లో ఉన్న RTC బస్  కండక్టర్ విధులను ఆటంక పరచడమే కాకుండ దాడి చేసిన కేసులో  ఇద్దరు నిందితులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష , మరియు ఒక్కొక్కరికీ 500/- రూపాయాల జరిమానా    విధిస్తూ ఆలంపూర్ JFCM కోర్టు ఇంచార్జి జడ్జి  శ్రీ డి. ఉదయ్ నాయక్  ఈ రోజు తీర్పును వెల్లడించారు.

కేసు వివరాలు

గద్వాల్ RTC డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బి .కృష్ణయ్య s/o బలరాం, వయస్సు -33 సంవత్సరాలు, అను వ్యక్తి తేది 15.03.2015 నాడు సాయంత్రము తాను విధులు నిర్వహిస్తున్న RTC బస్ నం TS 062 o 0158 నందు ఆలంపూర్ నుండి కర్నూల్ కు వెళుతుండగా మాంటిస్సోరి స్కూల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు మధ్యం త్రాగి బస్ ఎక్కి డోర్ దగ్గర నిలబడి బస్సు ఎక్కే ప్రయాణికులపై ఉమ్మివేయడం, కావాలని వారిని త్రాకడం చేస్తుండగా అలా ఎందుకు చేస్తున్నారు అని తాను అడుగగా తమను చేతులతో మెడ పైన, బుజాల పైన కొట్టారని అప్పుడు బస్ లో ఉన్న ప్రయాణికులు సర్ది చెప్పడం తో తరవాత బస్ కర్నూల్ బస్ స్టాండ్ కు చేరిందని తరవాత తిరిగి వస్తుండగా ఇమామ్ పూర్ గ్రామం దగ్గర బస్ ఎక్కగా వారిని టికెట్ అడుగగా మమ్మల్నే టిక్కెట్ అడుగుతావా అంటు మళ్లీ పై ఇద్దరు దాడి చేశారని  వారిని విచారించగా వారు1. చాకలి శ్రీనివాసులు, 2. పి.గోపీ s/o కృష్ణ   లుగా తెలిసిందని కావున తమ విధులకు ఆటంక పరుస్తూ తమ పై దాడి చేసిన ఇద్దరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా అప్పటి ఎస్సై పర్వతాలు క్రైమ్  no 32/2015 u/s 353,323 r/w 34IPC గా కేసు నమోదు చేయడం జరిగింది. 
 అనంతరం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీస్  అధికారులు   తదుపరి విచారణ పూర్తి చేసి ఆలంపూర్ కోర్టులో చార్జ్ షీట్  దాఖలు చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీమతి  రితిరాజ్ ఆదేశానుసారం కోర్టులో కేసు ట్రయల్  సమయంలో జిల్లా అదనపు  ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్ పర్యవేక్షణలో డి. ఎస్పీ శ్రీ కె .సత్యనారాయణ సూచనలతో, ఆలంపూర్ సి . ఐ రవి బాబు, ఎస్సై నాగరాజు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.  ఈరోజు  JFCM ఆలంపూర్  కోర్టు ఇంచార్జి  శ్రీ డి. ఉదయ్ నాయక్ ఇరువురి వాదనలు విన్న తర్వాత దాడి చేసినట్లు నిరూపితం కావడం తో A1చాకలి శ్రీనివాస్ s /o వెంకటన్న , వయసు - 48 సం "లు, వృత్తి - వ్యవసాయం,R/o ఆలంపూర్, A2- పీ.గోపీ s/o  కృష్ణ, వయసు -40 సo"లు, వృత్తి - అటెండర్, MPDO ఆఫీస్,ఆలంపూర్ లకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికీ 500/- రూపాయాల జరిమానా విధిస్తూ  తీర్పు వెల్లడించారు.
నేరస్థులకు జైలు శిక్ష పడడానికి    అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్ రాజు,  కోర్టు కానిస్టేబుల్ మా భాషా లు   సహకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి  అప్పటి ఎస్సై పర్వతాలు, ప్రస్తుత ఎస్సై నాగరాజు అసిస్టెంట్  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్ రాజును, కోర్టు డ్యూటీ పోలీస్ అధికారి మా బాషా ను   జిల్లా ఎస్పీ  అభినందించారు.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా