బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ నామినేషన్ కు భారీగా బయలుదేరిన జనం

బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ నామినేషన్ కు భారీగా  బయలుదేరిన జనం

సబ్ టైటిల్ .కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కెసిఆర్ చేతిలో పెట్టొద్దు

జనం న్యూస్. నవంబర్ 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రెహమాన్)నర్సాపూర్ నియోజకవర్గ పట్టణంలో మండలాల వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి మురళి యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు ప్రజలు అభిమానులు అశేష వాహిని మధ్య డీజేలు సప్పులతో బ్యాండ్ మేళాలతో కళాకారుల నృత్యాలతో నర్సాపూర్ అజయ్ యాదవ్ కాంప్లెక్స్ బిజెపి పార్టీ ఆఫీసు నుండి  ఊరేగింపుగా బయలుదేరి నర్సాపూర్ ఎల్లమ్మ గుడి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బిజెపి చేరికల కమిటీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  సమక్షంలో బయలుదేరి నామినేషన్ వేసిన నర్సాపూర్ బిజెపిఎమ్మెల్యే అభ్యర్థి    మురళీధర్ యాదవ్  అనంతరం విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ బిజెపి పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పార్టీ టికెట్ ఇచ్చినందున తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం  ప్రపంచ దేశాలలో దేశానికి గుర్తింపు తెస్తుందన్నారు. ఎమ్మెల్యేఈటెల రాజేందర్ మాట్లాడుతూఏ పార్టీలు కేటాయించని ఎక్కువ సీట్లను బిజెపి పార్టీ తెలంగాణలో బీసీలకు కేటాయించిందని అదేవిధంగా   ముఖ్యమంత్రి అభ్యర్థి గా అధిష్టానం బీసీని ప్రకటించిందని తెలిపారు రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు నర్సాపూర్ లో బి ఆర్ ఎస్ కాంగ్రెస్ లు ఒకే వర్గానికి చెందినవారికి టికెట్లు ఇచ్చారని అన్నారు ఈ రెండు పార్టీల హామీలను ఎవరు నమ్మబోరని ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని తెలిపారు నర్సాపూర్ నుండి బీసీల నుంచి మురళి యాదవ్ కు  అవకాశం ఇచ్చిందన్నారు. నర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు బిజెపి ఎమ్మెల్యేఈటెల రాజేందర్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కౌన్సిలర్ మమతా రమేష్ కౌన్సిలర్ యాదగిరి సురేష్ హత్నూర మండల అధ్యక్షులు నాగప్రముగౌడ్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ సతీష్ గౌడ్ మాజీ ఎంపీపీ అశోక్ కౌన్సిలర్ రాజేందర్ చర్ల శ్రీశైలం సీనియర్ నాయకులు శ్రీశైలం హత్నూర మండల్  యువజన సంగం నాయకులు  నాగేష్ సుధీర్ ప్రభాకర్ కృష్ణ గౌడ్ ప్రవీణ్ గౌడ్ మహంకాళి సుధాకర్ దండు సతీష్ ప్రశాంత్ చారి సిహెచ్ ప్రశాంత్ ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు భారీ  సంఖ్యలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ నామినేషన్ లో పాల్గొన్నారు