బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ ప్రారంభం

బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ ప్రారంభం

జనం న్యూస్ సెప్టెంబర్ 30 నారాయణఖేడ్ ఆర్ సి ఇంచార్జ్ సర్వోదయ పౌండేషన్ వారి సహకారంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజి రెడ్డి సమక్షంలో  లైబ్రరీ  & స్టడీ సెంటర్ ను   ఐఆర్ఎస్ శ్రీ.సుధాకర్ నాయక్, డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఖేఢ్ డిఎస్పీ జై వెంకట్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజి రెడ్డి, ఖేఢ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, గ్రామ సర్పంచ్ రేణుక పండరి, ఎంపీటీసీ రాములు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ఉపాధ్యక్షులు బృందం చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.అనంతరం ఐ.ఆర్.ఎస్ శ్రీ.సుధాకర్ నాయక్ మాట్లాడుతూ....ఈ అవకాశాన్ని ప్రతి  విద్యార్థి విద్యార్థులు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం విద్యార్థులకు లైబ్రరీ పై పలు అంశాలు వివరించారు. జిల్లా డిఆర్డిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరానికి ఎదగాలంటే కావాల్సింది విద్య అని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాలలో సర్వోదయ పౌండేషన్ వారి సహకారంతో లైబ్రరీ ప్రారంభించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బృందం, పోలీస్ బృందం గ్రామ సర్పంచ్ రేణుక పండరి , ఎంపీటీసీ రాములు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.