మాదిగలకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబార్దార్

మాదిగలకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబార్దార్

మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  

జనం న్యూస్. ఏప్రిల్ 7. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)

మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రదాన రహదారి పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం  రహదారిపై  ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ  మాట్లాడుతూ 
 కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కాకుండా బీసీలకు కూడా అన్యాయం చేసిందని 4% లేని రెడ్డిలకు 6 స్థానాలు కేటాయించి 50% ఉన్న బీసీలకు 2 స్థానాలు కేటాయించడం చాలా దురదృష్టకరమన్నారు మాదిగలకు మాత్రం గుండు సున్నా పెట్టి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు
ప్రచారాల్లో  ప్రజా ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్  మెజార్టీ వర్గాల ప్రజలకు అవకాశాలు దక్కనీయకుండా చేస్తుందని అన్నారు 
దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని కష్టపడే మా నాయకులకు టికెట్ ఆశించిన నేతలకు విలువ లేదా అని ప్రశ్నించారు  వారు జెండాలు మోసే కాన్నే ఉండాలి తప్ప పదవులకు అర్హులు కారా 
తనకు పోటీ రావొద్దని మాదిగల ఎదుగుదలను ఓర్వలేక కుట్రలు పన్ని పదవుల కోసం కండువాలు మార్చే రాజకీయ అవకాశవాది మాదిగ బిడ్డల రాజకీయ భవిష్యత్తును బలి తీసుకుంటున్న కడియం శ్రీహరి మందకృష్ణ మాదిగ పై మాట్లాడం హాస్యాస్పదం ఉందన్నారు ఇప్పటికైనా
కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలన్నారు మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో రెండు స్థానాలను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు 
కాంగ్రెస్ తమ విధానాలను మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు పెద్ద గీత మాదిగ మాట్లాడుతూ 
మహాజన నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు స్థానం కల్పించకుండా చేసిన  అన్యాయాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రదాన రహదారి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో. 
పెద్ద గీత మాదిగ
ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు
గందగల్ల ప్రసాద్ మాదిగ
ఎం.ఎస్.పి జిల్లా కార్యదర్శి
ముక్కగల్ల కవిత మాదిగ
ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు
గందగల్ల వీరయ్య మాదిగ
ఎం.ఎస్.పి జిల్లా నాయకులు
దేవులపల్లి మహేష్ మాదిగ
ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు
కుమ్మరి పల్లవి మహాజన్
ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు
గంగెరి అనిల్ మాదిగ
ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ సంగారెడ్డి
పోతురాజు శివ కుమార్
 మాదిగ
ఎమ్మార్పీఎస్ టౌన్ కో కన్వీనర్
నల్లోల్ల మెగులయ్య మాదిగ
 ఎం.ఎస్.పి నాయకులు 
డప్పు సత్యం మాదిగ 
 ఎం.ఎస్.పి నాయకులు 
కసాల ప్రణవ్ మాదిగ
ఎమ్మార్పీఎస్ నాయకులు 
పొట్లగల్ల విష్ణు మాదిగ 
ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.