మెదక్ రోడ్ షో లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ...

మెదక్ రోడ్ షో లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ...

సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సవాల్..

అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా...నువ్వు వస్తావా దమ్ముంటే..

ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా..

రాజీనామా లేఖలను ఇద్దరం మేధావులు చేతిలో పెడదాం..

నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్ కి ఇస్తారు..

చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ కి ఇస్తారు. 

దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా.

రాకుంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతది.

కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తోక ముడిచినట్టే, ఇప్పుడు అదే అవుతుంది .

జనం న్యూస్ 2024 ఏప్రిల్ 25 మెదక్ (జిల్లా బ్యూరో)

25 ఏళ్ళల్ల మెదక్ లో గులాబి జెండా ఎగురుతున్నది. వేరే జెండా ఎగురలేదు.
మెదక్ జిల్లా గులాబి అడ్డా. మళ్ళీ బి ఆర్ ఎస్ గెలువ బొతున్నది.10 ఎండ్లల్ల కేసీఆర్ ఏం చేశాడు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. 
ఏం చేశాడు బిడ్డా లిల్లీపుట్.
కేసీఆర్ వల్లనే జిల్లా అయ్యింది. ఆయన కలెక్టరేట్ కట్టుండు కాబట్టి నువ్వు నామినేషన్ కు మెదక్ కు వచ్చావు.
ఇందిరా గాంధీ చేసింది అంటున్నావు. పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.
ఇందిరా గాంధీ భేల్ తెచ్చిందని అబద్ధం ఆడుతున్నారు. 
1952లో అది వస్తే, ఇందిరా 1980 ఎంపి అయ్యారు.
పేగులు మెడలో రాక్షసులు వేసుకుంటారు. సిఎం స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారు.
మెదక్ అభివ్రుది గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు.జిల్లాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్అందమైన నాలుగు లైన్ రహదారి చేసింది కేసీఆర్
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ అమలు అని బాండ్ పేపర్ మీద రాసారు.
బాండ్ పేపర్ పరువు తీశారు. దేవుళ్ళను రాజకీయాలకు వాడుతున్నారు.
నువ్వు ఎవరి మీద ఓట్లు పెట్టినా నిన్ను నమ్మరు. 
ఆరు హామీలు అమలు కాలేదు. చేసిన అంటున్నారు.
ఈ ముఖ్యమంత్రి కి నా ఎత్తు గురించి ధ్యాస ఉంది గాని రైతుల సమస్య పట్ల ధ్యాసే లేదు. 200 పైగా రైతులు చనిపోయారు. ఆటో కార్మికులు 30 మంది చనిపోయారు.
వారిని పరామర్శించరు. డిల్లీలో తిరుగుతారు.
బిజెపి రఘునందన్ మాటలు నమ్మడమంటే నీళ్లు లేని బావిలో దూకడమే. 
దుబ్బాకల అలాగే మాట్లాడితే అక్కడ ప్రజల బుద్ధి చెప్పారు. 
బిజెపి ఏ వర్గాలకు మేలు చేయలేదు. 
బిఆర్ఎస్ గెలుపు 6 గ్యారంటీల అమలుకు మలుపు అయితది. 
మనం గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళ మెడలు ఉంచడం సాధ్యమవుతుంది. 
కాంగ్రెస్ వాళ్లను భూమి మీద దించాలంటే వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా.
జిల్లాలు ఎక్కువ అయ్యాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి.
మనకు మంచి అభ్యర్థి దొరికిండు. వెంకటరామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి.
ఒకాయన ఆరో తరగతి, మరొకరు బ్లాక్ మెయిలర్. బి ఆర్ ఎస్ నుండి కలెక్టర్ గా పని చేసిన వ్యక్తి.
ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా అంటున్నారు.
ప్రజలు కార్యకర్తల దగ్గరికి వెళ్లి మోసాల గురించి చెప్పాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చింత ప్రభాకర్ మెదక్ చైర్పర్సన్ హేమలత చంద్ర గౌడ్  తిరుపతిరెడ్డి   మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి ఎంపీటీసీలు ఎంపీపీలు కార్యకర్తలు ప్రజలు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు