లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియు కోటి నవదుర్గ అధ్వర్యంలో మెల్విన్‌ జోన్స్‌కు ఘన నివాళి

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియు కోటి నవదుర్గ అధ్వర్యంలో మెల్విన్‌ జోన్స్‌కు ఘన నివాళి

 జనం న్యూస్ కోరుట్ల జనవరి 14 గిన్నెల శ్రీకాంత్ నియోజకవర్గం ఇంచార్జ్ 

లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్‌ జోన్స్‌ జయంతి వేడుకలను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్ కోరట్ల మరియు కోటి నవ దుర్గ వారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు వనపర్తి చంద్ర మోహన్ మాట్లాడుతూ మెల్విన్‌ జోన్స్ అనబడే ఒక్క వ్యక్తితో ప్రారంభమైన లయన్స్ సేవా సంస్థ 1.4 మిలియన్ల సేవకులతో ప్రపంచవ్యాప్తంగా నిత్యం సామాజిక సేవలను చేయడం హర్షదాయకమని, మెల్విన్‌ జోన్స్ స్పూర్తితో ‘నా కోసం కాదు, మీ కోసం’ అంటూ మనందరం కొంత స్వార్థాన్ని వీడనాడి నిరుపేద అవసరార్థులకు అత్యవసర సేవలు అందించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ కుందారపు మహేందర్, ట్రేసరెర్ కొండ బత్తిని అనంత కృష్ణ ప్రసాద్, మహిళా క్లబ్ సెక్రెటరీ కుండారపు ప్రేమలత, క్లబ్ సీనియర్ నాయకులు గండ్ర దిలీప్ రావ్, గుంటుక చంద్ర ప్రకాష్, అల్లాడి ప్రవీణ్ కుమార్, ఏలిమిల్ల రామ్ నారాయణ, ఉషా కిరణ్ , చాప కిశోర్, మంచాల జగన్, ఏలేటి లక్ష్మారెడ్డి, కనపర్తి శ్రీనివాస్, పడాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.