విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేది ఉపాధ్యాయులే

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేది ఉపాధ్యాయులే

విద్యా దశలోనే వారిని తీర్చిదిద్దవచ్చు....
---- యువత సన్మార్గంలో నడిపే విధంగా కృషి చేయాలి
---- రోటరీ క్లబ్ ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరావు
జనం న్యూస్,జనవరి 25 విజయనగరంవిద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేది ఉపాధ్యాయులే అని రోటరీ క్లబ్ ఎలక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. బుధవారం స్థానిక సితం కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, ఒకేషనల్ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు కోసం రోటరీ క్లబ్, థి యూనివర్సిటీ ఆఫ్ మెలబోర్న్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ మోబిలిటి, కెరియర్ సక్సెస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే శిక్షణ కార్యక్రమంకి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం విద్యార్థుల్లో చాలామంది చిన్న వయసులోనే ప్రమాదకరమైన  వ్యసనాలు కి బానిస అవుతున్నారు అని తెలిపారు. ఇంటిలో ఎవరి మాట వినే పరిస్థితి లేదు అని తెలిపారు. ఇలాంటి వారిని విద్యా దశలో ఉన్నప్పుడే మార్చగలం అని తెలిపారు. ఇలాంటి బాధ్యత ఉపాధ్యాయులు మీద ఉంది అని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మార్గంలో నడిపే వ్యక్తులు అని , వారికి మంచి చెడులు బోధించగలరు అని, విద్యార్థులు కూడా ఎక్కువగా వినేది ఉపాధ్యాయులు మాటే అని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్ ఉపాధ్యాయులు మీదే ఆధారపడి ఉంది అని, అలాంటి విద్యార్థులును మరింత ఉత్తమంగా తీర్చిద్దేందుకు రోటరీ క్లబ్, యూనివర్సిటీ ఆఫ్ మెలబోర్న్ ఇలాంటి చక్కని శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉపాధ్యాయులుకి కలుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబెల్ ఎడ్యుకేషన్ సి.ఈ. ఓ. రాసిక్యూల్, మంజునాధ్, బొండపల్లి ఎం.ఈ.ఓ.ఏ.వెంకట రమణ, సమగ్ర శిక్ష ఏ.ఎం.ఓ. బి.ప్రసాద్ రావు , ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....