డాడీ సినిమాలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపొద్ధి..!

డాడీ సినిమాలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపొద్ధి..!

జనం న్యూస్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం డాడీ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి కు జోడిగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, స్వర్గీయ ఏం ఎస్ నారాయణ,అల్లు అర్జున్ కీలక పాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరో చిరంజీవి కూతురుగా అక్షయ పాత్రలో నటించిన చిన్నారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హోత్రా. ముంబై కు చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో అనుష్క మల్హోత్రా పాత్రకు విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఈ చిన్నారికి బాలీవుడ్లో కూడా పలు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ చదువుకి ఆటంకం కలుగుతుంది అని ఉద్దేశంతో ఆమె తల్లితండ్రులు అనుష్క ను సినిమాలకు దూరంగా ఉంచారు.

ప్రస్తుతం అనుష్క మల్హోత్రా డిగ్రీ పూర్తి చేసుకొని మోడలింగ్ రంగంలో ఉంది. అయితే తాజాగా అనుష్క మల్హోత్రా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందొ ఆమె లేటెస్ట్ ఫోటోలు చుస్తే తెలుస్తుంది.