కార్మిక హక్కుల పోరు జెండా మేడే

కార్మిక హక్కుల పోరు జెండా మేడే

ప్రపంచ కార్మిక కర్షక. శ్రామికులకు జనం న్యూస్ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ప్రత్యేక వార్త కథనం...

1886వ సంవత్సరంలో మే 1న అమెరికా దేశంలో చికాగో నగరంలోని హె మార్కెట్ నందు. ఆ దేశ కార్మికులు వెట్టి చాకిరి విముక్తి కోసం, ఎనిమిది గంటల పని విధానం అమలు కోసం మరియు కార్మిక హక్కుల సాధన కోసం, ఐక్యమై దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమై, లక్షలాదిమంది కార్మికుల చికాగో నగరానికి చేరుకొని తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూ ముందుకు కదలగా, ఆనాటి అమెరికా దరహంకార ప్రభుత్వం కార్మిక వర్గ పోరాటాన్ని చూసి తట్టుకోలేక భయాందోళనకు గురై, ఉవ్వెత్తి ఎగిసిపడిన కార్మిక ఉద్యమాన్ని అనిచివేయాలన్నా అక్కసుతో లక్షలాదిమంది కార్మికుల పైన తుపాకులు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించడంతో, అమెరికా బడా బూర్జోవా పెట్టుబడి దారి సామ్రాజ్యవాద ప్రభుత్వం ఎక్కుపెట్టిన తుపాకీ నుండి ఎగిసిపడ్డ తుపాకీ గుండ్లు కార్మికుల గుండెల్లోకి చీల్చుకుపోవడంతో, లక్షలాది మంది కార్మికుల గుండెల్లో నుంచి చిందిన ప్రతి రక్తపు బొట్టు నుండి ఎర్ర జెండా పుట్టింది. కార్మికుల గుండెల్లో నుంచి చిందిన రక్తాన్ని తమ పిడికిడిలో పట్టి తమ ఒంటిపై తెల్లటి చొక్కా గుడ్డకి ఆ రక్తాన్ని అద్ది ఇదే మా కార్మిక కర్షక పోరాటపు ఎర్ర జెండా అని వేలాదిమంది కార్మికులు నినదించి ఎర్రజెండాని ఎగరవేయగా పుట్టిందే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే.తమ హక్కుల సాధన కోసం పోరాటానికి నాంది పలికిన రోజు కార్మికులందరికీ మేడే‌ శుభాకాంక్షలు