సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం..! హీరో విశాల్ పైకి ఎక్కిన లారీ.. (వీడియో చూడండి)
జనం న్యూస్: తమిళ స్టార్ హీరో విశాల్ రీసెంట్ గా 'లాఠీ' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత సంవత్సరం క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినా అనుకున్న స్థాయిలో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేక పోయింది.దీంతో ఇప్పుడు మరో యాక్షన్ మూవీని రెడీ చేస్తున్నాడు విశాల్. 'మార్క్ ఆంటోనీ' అనే ఒక రా అండ్ రస్టిక్ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో విశాల్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించి అలరించడానికి రెడీ అయ్యాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను మూవీ యూనిట్ షూట్ చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరిగింది. సినిమాలో భాగంగా గోడని ఢీ కొట్టుకొని ఒక వెహికల్ లోపలికి రావాలి. అయితే ఢీ కొట్టిన తరువాత వెహికల్ అదుపుతప్పడంతో ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ల మీదకు ఆ వాహనం దూసుకు వచ్చింది. అయితే అదుపుతప్పిన విషయాన్ని గమనించిన ఆర్టిస్ట్ లు అక్కడి నుంచి వెంటనే తప్పించుకోవడంతో దేవుడి దయ వల్ల ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. దీంతో మూవీ టీం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.ఇక ఆ వీడియోని సెట్ లోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప సినిమాతో విలన్ గా మారిన సునీల్ ఈ సినిమాలో కూడా విలన్ తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే తెలుగు అమ్మాయి రీతూ వర్మ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, అభినయ ఇంకా రెడిన్ కింగ్స్లీ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.