తెలంగాణాలో పందుల పోటీలు.. గెలిచిన పందికి బారీ బహుమతి.
జనం న్యూస్ : కోడి పందాలు, ఎడ్ల పోటీల, గుర్రాపు పోటీలు చూశాం.. కానీ పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా.. లేదంటే భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతరకు వెళ్లండి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ పందుల పోటీలు నిర్వహించారు. భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా దౌదర్ పల్లి శివారులో పందులకు పోటీలు జరిపారు. ఈ పందల పోటీలకు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 20 పందులు వచ్చాయి. ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పందులకు బహుమతులు ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన పందుల యజమానులకు ప్రైజ్ మనీగా రూ.30,000, సెకండ్ ప్రైజ్ రూ.20,000, థర్డ్ ప్రైజ్గా రూ.10,000 అందజేశారు. ఈ పందుల పోటీలను చూడడానికి జనలు భారీగా తరలొచ్చారు. ప్రతీ సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తామని నిర్వహుకులు చెబుతున్నారు.మొన్నసంక్రాంతికి కూడా పందుల పోటీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జరిగే పందుల పోటీలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కుంచనపల్లికి చెందిన ఓ సామాజిక వర్గం సంక్రాంతి సందర్భంగా ఏటా పందుల పోటీలు నిర్వహిస్తారు. పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు తమ పందులతో పోటీలకు హాజరవుతారు. పందులు చనిపోయేలా జీవహింస ఉండకపోవడం ఈ పోటీల ప్రత్యేకత అని నిర్వహుకులు చెప్పారు. బరిలో దిగిన వరాహం తోకముడిచి పారిపోతే ఓడిపోయినట్లు డిక్లేర్ చేసి విజేతను ప్రకటిస్తారని తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారట.