దారుణం..అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తిపై గొడ్డలితో దాడి.. ఎక్కడంటే.?

దారుణం..అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తిపై గొడ్డలితో దాడి.. ఎక్కడంటే.?

 జనం న్యూస్ మార్చి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం,

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన వేలేరుపాడులో చోటు చేసుకుంది.కుక్కునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కుర్సం వెంకటేష్(40) ఇంటికి తూర్పు మెట్ట గ్రామానికి చెందిన చిచ్చడి కృష్ణ (45)అనే వ్యక్తి తరచుగా వస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో కుర్సం వెంకటేష్ భార్యతో కృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తూరు గ్రామంలోని కుర్సం వెంకటేష్ ఇంటికి చిచ్చడి కృష్ణ వచ్చి వెళ్తుండగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం వచ్చి గొడ్డలితో దాడి చేశాడు.ఈ దాడిలో తలపై తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు వేరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బాధితుని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుని తల్లి ఫిర్యాదు మేరకు వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు.