5 మందితో పెళ్లి.. భర్త మర్మాంగాన్ని కోసేసిన ఆఖరి భార్య..
జనం న్యూస్ భోపాల్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం కాపురం చేశాడు. తరువాత భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. భార్య దూరం కావడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా జెండా ఎత్తేసింది. మూడో పెళ్లి చేసుకుంటే ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. నాలుగో పెళ్లి చేసుకున్నా ఆమె కూడా అతనితో కాపురం చెయ్యలేదు. తరువాత ఓ మహిళను ఐదవ పెళ్లి చేసుకుని ఆమెతోనే ప్రస్తుతం కాపురం చేస్తున్నాడు. అయితే ఐదవ భార్య చేతిలో అతను దారుణ హత్యకు గురైనాడు. భర్తను చంపేసిన ఐదవ భార్య అతని మర్మాంగం కూడా కోసేయడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రులిలో ఐదవ భార్య గొడ్డలితో ఆమె భర్తను నరికి చంపింది. బీరేందర్ గుర్జార్ అనే వ్యక్తి అతని ఐదవ భార్య చేతిలో హత్యకు గురైనాడు. బీరేందర్ ను అతని ఐదవ భార్య, కాంచనాగుర్జార్ అలియాస్ కాంచనా యాదవ్ హత్య చెయ్యడంతో అందరూ హడలిపోయారు. బీరందన్ ను హత్య చేసిన కాంచనా అతని మృతదేహాన్ని మాయం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి నిర్జనప్రదేశంలో పడేసిందని పోలీసులు అన్నారు, బీరేందర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరేందర్ ఛాతీ, మెడపై తీవ్రగాయాలైనాయని పోలీసులు గుర్తించారు. బీరేందర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు బీరేందర్ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అతని ఐదవ భార్య కాంచనా యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీస్ స్టేషన్ ఇంచార్జి అరుణ్ పాండే తెలిపారు. హత్యకు ముందు ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి కాంచనా ఆమె భర్త బీరేందర్ కు ఆహారంలో 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. నిద్రమాత్రలు కలిపిన భోజనం తిన్న బీరేందర్ మత్తులోకి జారుకున్నాడు. హత్యకు ముందు భర్త బీరేందర్ పై పలుమార్లు గొడ్డలితో దాడి చేసి చివరకు పదునైన ఆయుధంతో అతడి మర్మాంగం కోసేసిన కాంచనా ఆమె కసి తీర్చుకుందని విచారణలో అంగీకరించిందిని పోలీసు అధికారులు తెలిపారు. బీరందర్ ను హత్య చేసిన అనంతరం కంచనా ఆమె భర్త మృతదేహాన్ని దుప్పటిలో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసిందని, సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే బట్టలు, చెప్పులు తగులబెట్టిందని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన బీరేందర్ కు కాంచనా ఐదవ భార్య అని, గతంలో నలుగురు భార్యలు ఇతని వేధింపుల కారణంగా పెళ్లయిన కొంతకాలానికి అందరూ పారిపోయారని పోలీసులు అన్నారు. బీరేందర్ ను తానే హత్మ చేశానని కాంచనా అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని సింగ్రులి పోలీసులు తెలిపారు.